టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలో ఆడనున్నట్లు తెలుస్తోంది. సొంత జట్టు ఢిల్లీ తరుఫున తాజా సీజన్లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ రంజీ ట్రోఫీ 2024-2025 ఎడిషన్‌లో పాల్గొనబోయే ఢిల్లీ ప్రాబబుల్ టీమ్‌లో కోహ్లి పేరు ఉంది. మరోవైపు రిషబ్ పంత్ పేరు కూడా ఈ జాబితాలో చేర్చారు. దీంతో వీరిద్దరు ఈ జట్టులో ఆడే అవకాశాలు కనపడుతున్నాయి.