బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడి అంతరాయం కొనసాగుతోంది. రెండో రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దైంది. వర్షం వస్తూ ఆగుతూ ఉండటంతో మైదానం చిత్తడిగానే ఉంది. దీంతో మ్యాచ్ నిర్వహణకు సాధ్యం కాదనే ఉద్దేశంతో అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, రెండో టెస్టులో బంగ్లాదేశ్ తొలిరోజు 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.