పాక్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ జట్టు వైఫల్యానికి PCBలోని కొందరి అహంకారమే కారణమని ధ్వజమెత్తాడు. ‘జట్టు ఎంపిక, కెప్టెన్, కోచ్ విషయంలో ప్రొఫెషనల్‌గా ఉండటాన్ని BCCI నుంచి PCB నేర్చుకోవాలి. వరల్డ్ క్రికెట్లో ఆధిపత్యం ప్రదర్శించాలన్నా, నం.1 జట్టుగా మారాలన్నా ఈ విషయాలు చాలా ముఖ్యం. కొందరి అహంకారం వల్లే పాక్ క్రికెట్ పరిస్థితి ఇలా ఉంది.’ అని పేర్కొన్నాడు.