ప్రో కబడ్డీ సీజన్-11కు సంబంధించిన అధికారిక షెడ్యూల్ను టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. అక్టోబర్ 18న ప్రారంభంకానున్న ఈ టోర్నీలో హైదరాబాద్ వేదికగా ఆరంభ మ్యాచులు జరగనున్నాయి. ఈసారి టోర్నీని 3 నగరాల్లో మాత్రమే నిర్వహించనున్నారు. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 9 వరకు హైదరాబాద్, నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు నోయిడా, డిసెంబర్ 3 నుంచి 24 వరకు పుణే వేదికగా మ్యాచులు జరుగుతాయి. ప్లే ఆఫ్స్ మ్యాచులను లీగ్ ప్రారంభమయ్యాక ప్రకటిస్తారు.