ఇంగ్లాండ్ తాత్కాలిక వన్డే జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ అరుదైన రికార్డ్ సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో సెంచరీ సాధించడం ద్వారా ఇంగ్లాండ్ తరపున సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా (25 ఏళ్ల 215 రోజులు) నిలిచాడు. ఇది వరకు ఈ రికార్డ్ ఆ దేశ మాజీ ఆటగాడు అలెస్టర్ కుక్(26 ఏళ్ల 190 రోజులు) పేరుతో ఉండేది. కాగా ఈ మ్యాచులో విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా(14) వరుస విజయాల రికార్డును ఇంగ్లాండ్ బ్రేక్ చేసింది.