ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 304 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లీష్ జట్టు 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ హ్యారీ బ్రూక్(110), విల్ జాక్స్(84) అద్భుతంగా ఆడి జట్టును నిలబెట్టారు. 37.4ఓవర్లలో 254 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం పడటంతో DLS ప్రకారం 46 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు.