PM Modi Comments Row, Bandi Sanjay Verses Minister KTR
PM Modi Comments Row: సీఎం కేసీఆర్ (CM KCR), గ్రేటర్ ఎన్నికల గురించి ప్రధాని మోడీ (PM MODI) నిన్న నిజామాబాద్‌లో చేసిన కామెంట్స్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రూపాయి. మోడీ కామెంట్స్ తర్వాత మంత్రులు స్పందించారు. తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ప్రధాని మోడీ చేసిన ఆరోపణలు నిజం అని స్పష్టంచేశారు. కాదు అని చెప్పే ధైర్యం సీఎం కేసీఆర్‌కు ఉందా అని అడిగారు. ఆ ఆరోపణలు నిజం కాదు అని భాగ్యలక్ష్మీ ఆలయానికి తడి బట్టలతో రావాలని సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు కాకున్నా.. లక్ష్మీ నరసింహా స్వామి ఆలయానికి రావాలని కోరారు. అలా వస్తే కేసీఆర్ గ్రేట్ అనుకుంటామని చెప్పారు. మరీ వచ్చి చెప్పే దమ్ము ఉందా అని అడిగారు.
ఏం జరిగిందంటే..?
వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి నిన్న నిజామాబాద్‌కు వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. గ్రేటర్ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ మద్దతు అడిగారని తెలిపారు. అంతేకాదు తన ఆరోగ్యం బాగోలేదని.. తన కుమారుడిని సీఎం చేస్తానని కూడా చెప్పారట. ఇదే విషయాన్ని మోడీ ప్రస్తావించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు, మంత్రులు వరసగా స్పందించారు. కేటీఆర్ స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ ఫైటర్ అని పేర్కొన్నారు. బీజేపీ ఛీటర్ అని ధ్వజమెత్తారు. ఎన్డీఏ మునిగిపోయే నావ అని.. అందుకే అందుల్లోంచి శివసేన, టీడీపీ, శిరోమణి అకాళిదల్, జేడీయూ బయటకు వచ్చాయని వివరించారు. తమకేమన్న పిచ్చి కుక్క కరిచిందా..? ఎన్టీఏలో కూటమిలో చేరడానికి అడిగారు. ఎన్టీఏ కూటమిలో సీబీఐ, ఈడీ, ఐటీ ఉన్నాయని సెటైర్లు వేశారు.
అదీ నా కర్మ
మోడీ కామెంట్లపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ.. నిజామాబాద్ కార్యక్రమానికి వెళ్లానని.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్వైట్ చేయాలి కదా అని పేర్కొన్నారు. అదీ తన కర్మ అంటూ చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ మాట్లాడే సమయంలో తాను అక్కడే ఉన్నానని.. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదన్నారు. ఇక్కడికి వచ్చి ఏం చేశారు..? బీజేపీ ఏం చేసిందని మండిపడ్డారు. మంత్రాలకు చింతకాయలు రాలవు అని మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ పీఠాలు కదులుతున్నాయని చెప్పారు. తెలంగాణలో జరుగుతోన్న అభివృద్ధిని దేశం గమనిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ 100 ఏళ్లయినా అధికారంలో రాదన్నారు. అలాగే బీఆర్ఎస్ బలపడుతోందని.. కాంగ్రెస్, బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఏర్పడనుందని తెలిపారు.
మోడీ టూరిస్ట్ అయితే.. మరీ కేసీఆర్
మోడీ పర్యటనపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ప్రధాని టూరిస్ట్ అని కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలపై ఈ రోజు బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణకు మోడీ టూరిస్ట్ అయితే.. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లో తిరిగిన కేసీఆర్ ఏమవుతారని నిలదీశారు. ఎన్టీఏలో చేరడానికి పిచ్చి కుక్క కరిచిందా అని అనడంతో.. బీఆర్ఎస్ను చూసి పిచ్చి కుక్కలే పారిపోతున్నాయని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. బీఆర్ఎస్ పార్టీలో అలజడి మొదలైందని.. ఆ పార్టీ చీలడం ఖాయం అని జోస్యం చెప్పారు. ప్రధాని మోడీని చూసి సీఎం కేసీఆర్ వణుకుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్టీఏలో 38 పార్టీలు ఉన్నాయని తెలిపారు. 2009లో పిలవని పేరంటానికి కేసీఆర్ వచ్చి.. ఎన్టీఏ ర్యాలీలో ఎందుకు పాల్గొన్నారని అడిగారు. బీఆర్ఎస్ అభివృద్ధి వ్యతిరేక పార్టీ అని.. గ్రేటర్ ఎన్నికల్లో తమకు బీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా 500 మాత్రమేనని తెలిపారు. ప్రధానికి గౌరవించాలని.. పొలైట్‌గా మాట్లాడాలని సూచించారు. వాళ్లు ఓయ్ అంటే.. తాము ఓరేయ్ అనగలం అని తేల్చిచెప్పారు.