»If Time Does Not Come Together The Rope Also Becomes A Snake How Do You Mean
Time కలిసి రాకుంటే తాడు కూడా పాము అవుతోంది.. ఎలా అంటే..?
కాలం కలిసిరాకుంటే ఏం చేసినా కష్టమే అవుతోంది. ఎంత పెద్ద వారైనా సరే.. కాలగర్భంలో కలిసిపోతారు. వైఎస్ఆర్, పీవీ నరసింహారు, సీనియర్ ఎన్టీఆర్ చివరి రోజుల్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
If Time does not come together, the rope also becomes a snake.. How do you mean..?
Time: అన్నింటికీ టైమ్ రావాలి అంటారు. సమయం వస్తే చాలు.. అన్నీ పనులు చకచకా జరిగిపోతాయి. లేదంటే.. ఏ పని పూర్తి కాదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతుంది. అవును రాజకీయ నేతలు, సినీ తారలు కూడా చాలా కష్ట పడ్డారు. కెరీర్ చివరలో అవమాన పడి.. తట్టుకోలేక చనిపోయారు. అలా కొందరు ప్రముఖుల గురించి తెలుసుకుందాం. పదండి.
సీనియర్ ఎన్టీఆర్- చిరంజీవి
సీనియర్ ఎన్టీఆర్.. తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలచిపోతారు. నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకత, గుర్తింపును చాటుకున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి.. అధికారం కూడా చేపట్టారు. కెరీర్ చివరలో రెండో పెళ్లి చేసుకోవడం.. లక్ష్మీ పార్వతీ పార్టీలో పెత్తనం చేయడంతో.. చంద్రబాబు అండ్ కో ఎదురు తిరిగారు. వైస్రాయ్ హోటల్ వద్ద ఎమ్మెల్యేల బేరసారాలు గురించి తెలిసిందే. హోటల్ వద్దకు ఎన్టీఆర్ వెళితే చెప్పులు వేసిన ఘటన ఇప్పటికీ కళ్లముందు కదలాడుతోంది. చివరి రోజుల్లో పిల్లలు రాక, ఆస్తులు లేక ఎన్టీఆర్ వేదన మనకు తెలుసు.. అలా క్షోభకు గురై చివరికీ గుండెపోటు రావడంతో చనిపోయారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పారు. కానీ ఆయనను చూసేందుకు వచ్చిన వారు.. ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అలా 2009 ఎన్నికల ప్రచారంలో కోడిగుడ్లతో దాడి చేశారు. తర్వాత రాజకీయాలు అంటే నచ్చక.. తప్పుకున్నారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం చిరు చేసిన పెద్ద తప్పు.. అలా చివరికీ పార్టీ కనుమరుగు అయ్యింది. చిరు కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
పీవీ- వైఎస్ఆర్- జగన్
మేధావి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. 420 కేసులు నమోదు కావడంతో బోను ఎక్కాల్సి వచ్చింది. ఆ కేసులను ఎదుర్కొనేందుకు ఉన్న సమయం అంతా పట్టింది. మాజీ ప్రధాని అంత్యక్రియలను ఢిల్లీలో నిర్వహించలేదు. హైదరాబాద్ తీసుకొస్తే.. ఎక్కడ చేయాలో తెలియక.. సాగర్ సమీపంలో చేశారు. ఆ ప్రక్రియ కూడా సరిగా చేయలేదనే అపవాదు వచ్చింది. ఇక మాజీ సీఎం వైఎస్ఆర్కు ఘోరమైన చావు వచ్చింది. ఆయన శవం కూడా దొరకని పరిస్థితి.. ప్రజల అభిమానం చూరగొన్నారు కానీ.. మొహం కూడా కనిపించని సిచుయేషన్ నెలకొంది. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ అవినీతి ఆరోపణలకు సంబంధించి 16 నెలలు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో భార్య, చెల్లి, తల్లి అండగా నిలిచారు. పార్టీ వ్యవహారాలను తల్లి చూసుకోగా.. చెల్లి పాదయాత్ర చేసి మరింత దగ్గర అయ్యారు. సాక్షి మీడియా, భారతి సిమెంట్ లాంటి వ్యాపారాలను భార్య చూసుకున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అయితే నియంతను తలపించారు. కంటెంట్ ఆఫ్ హౌస్ కింద పార్లమెంట్ ఆమెను జైలుకు పంపించింది. సిక్కుల పవిత్ర స్థలం స్వర్ణ దేవాలయానికి సైనికులను బూట్లతో పంపించి తప్పుచేశారు. ఆమె చేసిన ఆపరేషన్ బ్లూ స్టార్ చివరికీ ప్రాణాలను బలి తీసుకుంది. ఉక్కు మహిళ జయలలిత కూడా చనిపోయే ముందు ఇబ్బంది కర పరిస్థితులను ఎదుర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆమె చీరను లాగి వివస్త్రను చేశారు. టాన్సి కేస్‌లో కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కేసులు నడుస్తుండగానే అనారోగ్యంతో చనిపోయారు.
సత్యం-చంద్రబాబు- మోడీ- కేసీఆర్
హైదరాబాద్‌లో ఐటీ వచ్చిన తర్వాత సత్యం కంప్యూటర్స్ అంటే మాములు క్రేజ్ కాదు.. అప్పట్లో సత్యం కంప్యూటర్స్‌లో జాబ్ అంటే వేరే లెవల్. అలాంటి రామలింగరాజు చేసిన ఫ్రాడ్‌కు నాలుగేళ్ల జైలు జీవితం గడిపాడు. గొప్ప విజన్ ఉన్న నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో ఊచలు లెక్కబెడుతున్నాడు. రాజమండ్రి జైలులో స్నేహ బ్యారక్‌లో ఉన్నారు. ఒకప్పుడు చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం ఇంటి వద్ద చేతులు కట్టుకుని కేసీఆర్ వేచి చూశారాట. ఇప్పుడు ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఓ పార్టీకి అధినేత.. అదీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందనుంది. ఎన్డీఏ అధికారంలో ఉన్న సమయంలో కన్వీనర్‌గా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆ సమయంలో బాబు అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు నరేంద్ర మోడీ. అప్పుడు మోడీని చంద్రబాబు కలువలేదు.. ఆ తర్వాత మోడీ అపాయింట్ మెంట్ తీసుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు బాబును కలిసేందుకు కేసీఆర్, మోడీ ట్రై చేయగా.. ఇప్పుడు వారిద్దరూ కలిసి బాబుకు పొలిటికల్‌గా ఎండ్ కార్డ్ వేసినంత పనిచేశారు. లక్షలమందిని ఊచకోత కోసి, నియంత అయిన హిట్లర్ చివరి రోజుల్లో ఏ దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. బంకర్లో దూరి.. భయపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్‌కు విజయాలు కిక్కు ఇచ్చాయి.. కానీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇలా పోతే చాలా మంది ఉన్నారు. వారంతా తాము, నేను అనే అహంకారంతో విర్రవీగారు. అందుకే అలా చివరికీ దిక్కులేని చావు చచ్చారు.