»Comet Nishimura A Miracle In The Sky On The 12th Of This Month
Viral News: ఈ నెల 12న ఆకాశంలో అద్భుతం
400 ఏళ్లకు ఒక సారి వచ్చే ఒక అద్భుతమైన దృష్యాన్ని సెప్టెంబర్ 12న దర్శించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని కోసం నేరుగా కాకుండా బైనాక్యూలర్ సాయంతో చూడాలని సూచిస్తున్నారు.
Comet Nishimura. A miracle in the sky on the 12th of this month
Viral News: ప్రతి రోజు ఈ విశ్వంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అందులో సౌర వ్యవస్థలో కూడా చోటుచేసుకుంటాయి. తాజాగా ఓ వార్త ఔత్సాహికులను ఎంతో ఉత్కంఠతకు గురి చేస్తుంది. అదేంటంటే ఆకాశం(Sky)లో ఓ అరుదైన తోక చుక్క ఈ నెల 12న కనిపించనుంది. దీని పేరు నిషిమురా(Nishimura). జపాన్ శాస్త్రవేత్త హిడియో నిషిమురా దీన్ని ఈ ఏడాదే ఆగస్ట్ 12న తొలిసారి కనిపెట్టారు. అందుకే దీనికి నిషిమురా అని నామకరణం చేశారు. అయిదే ఇది కిలోమీటర్ పరిమాణంలో ఉంటుందని వారు తెలిపారు. భూమికి 80 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి ఈ నెల 12న ఇది వెళ్లనుంది. ఉత్తరార్ధ గోళంలో నివసించే వారికి ఇది స్పష్టంగా కనిపించనుంది. ఈ తోకచుక్క 400 ఏళ్లకు ఒక సారి కనిపిస్తుండడంతో అందరికి దీనిపై ఆసక్తి పెరిగింది.
దీన్ని నేరుగా కంటితో కాకుండా ఏదైనా పరికరం సాయంతో దీన్ని స్పష్టంగా చూడొచ్చు. ఆకాశంలో ఇది ఉన్న స్థానం దృష్టా నేరుగా కంటితో చూస్తే అస్పష్టంగా అనిపిస్తుంది. తెల్లవారుజాము సమయంలో, సూర్యోదయానికి అరగంట ముందు ఈశాన్య దిక్కున నింగివైపు చూస్తే ఈ తోక చుక్క కనిపిస్తుంది. సూర్యుడికి చేరువ అయ్యే కొద్దీ ఇది మరింత ప్రకాశవంతంగా మారుతుంది. బైనాక్యులర్ సాయంతో కచ్చితమైన దిశలో చూస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుందని నాసా(NASA) సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ స్టడీస్ మేనేజర్ పౌల్ చోడాస్ తెలిపారు. సెప్టెంబర్ 17న సూర్యుడికి ఇది చేరువగా వెళనుందని తెలిపారు.