నయుడు ఇంకెన్ని రోజులు ప్రజలను బెదిరిస్తారు? వారి ఆగడాలకు చెక్ పెట్టే రోగులు దగ్గరపడ్డాయి. గత ఎన్నికలే చివరివి ప్లీజ్ ఒక్కసారి ఓటేసి గెలిపించండి అంటూ ఎమ్మెల్యే వనమా మాటలు అందరికీ గుర్తున్నాయి. కానీ ఈసారి కూడా తానే పోటీ చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉంది..
తన తల్లికి ఆరోగ్యం బాగాలేదంటూ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు దూరంగా ఉన్నారు. దాంతో ఈ నెల 22న విచారణకు రావాలంటూ సీబీఐ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. తాజాగా అవినాశ్ రెడ్డి ఆ నోటీసులకు బదులిస్తూ సీబీఐకు లేఖ రాశారు.
ప్రధాని మోదీ వివిధ ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలలో కూడా నిమగ్నమయ్యారు. వీరిలో ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో ఉన్నారు.
కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి భూ కేటాయింపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైరయ్యారు. వందల కోట్ల విలువచేసే భూమిని ప్రభుత్వం అప్పనంగా బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిందని ఆరోపించారు.
కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి 11 ఎకరాల భూమిని బదలాయిస్తూ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు మాత్రం ఈ విషయం దాచిపెట్టారు.
తెలంగాణలో జీవో 111 రద్దు నిర్ణయంపై ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి (Jeevan Reddy) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కోసమే జీవో 111 రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ క్రమంలోనే రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకనాయకుడిపై ప్రత్యర్థి పార్టీలు రాజకీయాలు చేయడం సహజం.
డీకే శివకుమార్ కర్ణాటక విదాన సౌధ అసెంబ్లీ మెట్లకు నమష్కరించారు. అప్పట్లో ప్రధాని మోడీ పార్లమెంట్ మెట్లకు వందనం చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
నా కష్టం నాది. అందరూ సహకరిస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచా. ఎవరో ఒకరు చేస్తే నేను ఈ స్థాయికి రాలేదు. ఏ రోజు లోపాయికారి ఒప్పందం చేసుకోలేదు. బెట్టింగ్ బంగార్రాజు అంటూ కామెంట్లు వస్తున్నాయి. ఆ పాపం ఎవరిది? ఆ నిందలు ఎవరు మోస్తున్నారు.
తెలంగాణ(Telangana) లో రైతులను మోసం చేసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు మహారాష్ట్ర అన్నదాతలను ముంచే పనిలో పడ్డారని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు.