డీకే శివకుమార్ కర్ణాటక విదాన సౌధ అసెంబ్లీ మెట్లకు నమష్కరించారు. అప్పట్లో ప్రధాని మోడీ పార్లమెంట్ మెట్లకు వందనం చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
DK Shivakumar: కంఠీరవ స్టేడియం వద్ద ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం కర్ణాటక సిద్ధారమయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) విధాన సౌధ అసెంబ్లీకి వచ్చారు. అక్కడ ఆసక్తికర ఘటన జరిగింది. సిద్ధరామయ్య ముందు వెళ్లగా.. వెనకాల డీకే వచ్చారు. అక్కడ కొందరు మీడియా ప్రతినిధులు/ అభిమానులు డీకేని పిలిచారు. సార్.. సార్ అనగా ఆగిపోయారు.
ఏం జరుగుతుందో తెలియదు.. డీకే శివకుమార్ (DK Shivakumar) ఆగారు. మెల్లిగా వంగి.. మెట్లకు పాధాభివందనం చేశారు. విధానసౌధ దేవాలయంతో సమానం అని.. గౌరవప్రదంగా నమష్కరించారని అతని అనుచరులు చెబుతున్నారు. దానిని వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది.
2014లో నరేంద్ర మోడీ (Modi) ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. తర్వాత పార్లమెంట్‌కు వచ్చిన సమయంలో మెట్లకు నమష్కరించారు. ఓ ఛాయ్‌వాలాను దేశం ప్రధానమంత్రిని చేసిందని చెప్పారు. ఇప్పుడు డీకే కూడా అలానే నమష్కారం చేశారు. డీకే సీఎం కాదు.. డిప్యూటీగా ప్రమాణం చేశారు. అంటే నెక్ట్స్ తన లక్ష్యం సీఎం పోస్ట్ అని చెప్పకనే చెప్పారు.
కర్ణాటకలో కష్టపడ్డానని సీఎం పదవీ ఇవ్వాలని డీకే (DK) డిమాండ్ చేసి.. తలొగ్గారు. ఒకానొక దశంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని డీకే నోటి వెంట వచ్చింది. అంటే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఆ సమయంలో పార్టీని గెలిపిస్తే.. నెక్ట్స్ కర్ణాటకలో అధికార మార్పిడి జరుగుతుందా అనే సందేహం కలుగుతుంది. సిద్దూను తీసి.. డీకేకు (dk) పదవీ ఇస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ರಾಜ್ಯದ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕರಿಸಿದ ನಂತರ ವಿಧಾನಸೌಧದ ಮೆಟ್ಟಿಲುಗಳಿಗೆ ನಮಿಸಿ ಪ್ರವೇಶಿಸಿದೆ. ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ, ಸಂವಿಧಾನದ ಆಶಯಗಳನ್ನು ಕಾಪಾಡುವ ವಿಧಾನಸೌಧವು ಒಂದು ದೈವ ಮಂದಿರವಿದ್ದಂತೆ. pic.twitter.com/GZI0MgZdLg
ఏదీ ఏమైనప్పటికీ విధాన సౌధకు డీకే (dk) నమష్కరించడంతో కొత్త వాదనకు తెరతీసింది. కాంగ్రెస్ పార్టీకి తాను వీర విధేయుడినని.. అందుకే తలొగ్గానని డీకే చెబుతున్నారు. డీకేకు సీఎం పోస్ట్‌పై హైకమాండ్ హామీ ఇచ్చిందని.. అందుకే ఆయన కూల్ అయ్యారని మరికొందరు అంటున్నారు.