»Link To Rs 2 Thousand Note With Draw With Bichagadu 2 Movie
Bichagadu-2: రూ.2 వేల నోటు విత్ డ్రాకు బిచ్చగాడు-2 మూవీకి లింక్.. అప్పట్లో ఆ నోటు.. ఇప్పుడు
రూ.2 వేల నోటు విత్ డ్రాకు బిచ్చగాడు మూవీకి లింక్ ఉన్నట్టు ఉంది. సినిమా వచ్చిన రోజే ఉపసంహరణ గురించి ప్రకటన వచ్చింది. ఇంతకుముందు బిచ్చగాడు సినిమా వచ్చిన ఏడాదే నోట్ల రద్దు జరిగిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు.
Link To Rs.2 Thousand Note With Draw With Bichagadu-2 Movie
Bichagadu-2: రూ.2 వేల నోటును విత్ డ్రా చేస్తున్నామని ఆర్బీఐ ప్రకటించగా.. నిన్నటి నుంచే అదే చర్చ. ఎప్పటి నుంచి డబ్బులు తీసుకుంటారు. ఎంత మొత్తం తీసుకుంటారు అనే చర్చ.. రూ.2 వేల నోటు విత్ డ్రా.. అప్పట్లో రూ.500, రూ.1000 నోటు రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బిచ్చగాడు (Bichagadu) మూవీ రాగా.. అందులో నోట్ల రద్దు గురించి సీన్ ఉంటుంది. ఇప్పుడు బిచ్చగాడు-2 (Bichagadu-2) రాగా.. అదే రోజు రూ.2 వేల నోటుపై ఆర్బీఐ ప్రకటన చేసింది.
బిచ్చగాడు టైమ్ లో 500/1000 నోట్ల ఉపసంహరణ బిచ్చగాడు-2 రిలీజ్ టైమ్ కి 2000 నోట్ల ఉపసంహరణ ——————— ఈ లింకేమిటి సామీ? pic.twitter.com/N7xM4XtAsV
వీటిని ప్రస్తావస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్ అవుతున్నాయి. బిచ్చగాడు (Bichagadu) మొదటి రిలీజ్కు రూ.500 నోట్లు.. రెండో రిలీజ్కు రూ.2 వేల నోట్లు రద్దు చేశారు జానకీ.. మూడో రిలీజ్ ఏమీ రద్దు చేస్తారో అనే పోస్టులు పెడుతున్నారు. మరో యూజర్ ఇలా రాశారు. బిచ్చగాడులో నోట్ల రద్దు కోసం ప్రతిపాదన చేశారని.. బిచ్చగాడు-2 చూడలేదని చెప్పారు. ఏమైనా సీన్ ఉందా అని అడిగాడు. మరొకరు బిచ్చగాడు-3 రాకుండా చూసుకోవాలని.. లేదంటే ఏం రద్దు చేస్తారో తెలియదన్నారు.
2016లో మే 13వ తేదీన బిచ్చగాడు (Bichagadu) మూవీ రాగా.. ఆ ఏడాది నవంబర్ 16వ తేదీన నోట్ల రద్దుపై ప్రధాని మోడీ (Modi) ప్రకటన చేశారు. రూ.2 వేల నోటు విత్ డ్రాపై నిన్న ఆర్బీఐ ప్రకటన చేయగా.. అదే రోజు బిచ్చగాడు-2 (Bichagadu-2) మూవీ రిలీజ్ అయ్యింది. యాదృచ్చికంగానే జరిగినా.. రెండింటికీ ముడిపెడుతూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
బిచ్చగాడు మొదటి రిలీజ్ కి….500..వేయినొట్లు.
బిచ్చగాడు రెండో రిలీజ్ కి 2000 నోట్లు రద్దు చేశారు జానకీ..