Tammineni Sitaram: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Sitaram) ఓ మీడియా ప్రతినిధిపై (Reporter) ఆగ్రహాం వ్యక్తం చేశారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని కుటుంబసభ్యులతో కలిసి స్పీకర్ (speaker) దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసు విచారణలో అవినాష్ రెడ్డి గురించి అడగడంతో ఆగ్రహాం వ్యక్తం చేశారు.
అవినాష్ రెడ్డి (avinash reddy) పారిపోతే వెంబడించే బాధ్యత దర్యాప్తు సంస్థ సీబీఐ చూసుకుంటుంది.. నీకు, నాకు ఎందుకు అని సీతారం అన్నారు. ఆ అంశంతో మీకేం పని.. నువ్వు ప్రశ్నించానికి లేదు.. నేను చెప్పడామినికి ఏమీ లేదు అన్నారు. హత్య కేసులో అవినాష్ (avinash) పాత్ర ఏంటీ, ఏమిటనే అంశాలు సీబీఐ పరిధిలోని వ్యవహారం అని చెప్పారు. విచారణ జరుగుతోందని.. నువ్వేమైనా సీబీఐ చీఫ్వా అని అడిగారు. అడగ్గానే నీకు చెప్పాలా.? మాకు అదే పనా..? అని మండిపడ్డారు.
ఆరోపణలు చేయడానికే ప్రతిపక్షాలు ఉన్నాయని చెప్పారు. ఏదో ఒక అంశం మాట్లాడకపోతే వారికి పూట గడవదని ధ్వజమెత్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. 175 స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామని చెబుతున్నారు. గడప గడపకు వెళ్తున్న తనకు జనం (people) నాడీ తెలిసిందని పేర్కొన్నారు.