»Sharmilas Challenge To Cm Kcr Give Tickets Only To Farmers
YS Sharmila : సీఎం కేసీఆర్ కు షర్మిల సవాల్..రైతులకు టికెట్లు ఇవ్వు..
తెలంగాణ(Telangana) లో రైతులను మోసం చేసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు మహారాష్ట్ర అన్నదాతలను ముంచే పనిలో పడ్డారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు.
వైస్ఆర్టీపీ చీఫ్ షర్మిల సీఎం కేసీఆర్ (CM KCR) పై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ(Telangana)లో రైతులను మోసం చేసిన సీఎం .. ఇప్పుడు మహారాష్ట్ర అన్నదాతలను ముంచే పనిలో పడ్డారని షర్మిల విమర్శించారు.చిత్తశుద్ధి ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ (BRS) తరఫున రైతులకే టికెట్లు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.తెలంగాణలో ఉద్యమ ద్రోహులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి.. మహారాష్ట్ర(Maharashtra)లో మాత్రం రైతులు అసెంబ్లీకి పోవాలంటూ గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. మీరు చెప్పే తెలంగాణ(Telangana) మోడల్ అంటే.. తొమ్మిదేళ్లలో 9వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉద్యమ ద్రోహులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి.. మహారాష్ట్రలో మాత్రం రైతులు అసెంబ్లీకి పోవాలంటూ గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. మీరు చెప్పే తెలంగాణ మోడల్ అంటే.. తొమ్మిదేళ్లలో 9వేల మంది రైతులు (Farmers) ఆత్మహత్యలు చేసుకోవడమా? అని ప్రశ్నించారు.