సినీ నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తాజాగా తాను కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ లో పాల్గొంటున్నట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
జనగాం బీఅర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేసిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి, చేర్యాల హాస్పిటల్‌కి తిరిగి ఇచ్చేందుకు ఆయన కూతురు తుల్జా భవాని నిర్ణయం తీసుకున్నారు. చేర్యాల పెద్ద చెరువు వద్ద గతంలో తుల్జా భవాని పేరిట ఉన్న 21 గంటల స్టలాన్ని తిరిగి ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ స్థలంపై గతంలో అనేక వివాదాలు, ఎమ్మెల్యేపై కబ్జా ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ భూమి తన పేరిట తన తండ్రి అక్రమంగ...
వరుసగా రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంటులు, ఇతర ముఖ్య అధికారులతో ఎన్నికల కమిషన్ బృందం సమావేశం చర్చలు జరుపుతోంది. ఎలాగైనా తెలంగాణలో 2023 లోనే ఎన్నికలు జరిగేలా ఈసీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్(Etela rajender), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(komatireddy Rajagopal Reddy) భేటీ ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి ఢిల్లీ నేతలకు చెప్పినట్లు వారు వెల్లడించారు.
ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ తన పోరాటాన్ని తన కొనసాగిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
టీడీపీ బహిరంగ సభ వేదిక ఒక్కసారిగా కూలిపోగా దానిపై కూర్చున్న 10 మందికిపైగా నేతలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఏపీ ఏలూరు జిల్లాలోని నూజివీడు పరిధిలో చోటుచేసుకుంది.
కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలు, నటి ఖుష్బూ..తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఫోటో షేర్ చేశారు. త్వరలోనే కోలుకుని అందరి ముందుకు వస్తానని ట్వీట్ చేశారు.
పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీ ఫైర్ అయ్యాడు. మీడియా ముఖంగా ఆయన పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాపుల మధ్య చిచ్చుపెట్టి పవన్ గెలవలేడని, ముద్రగడకు ఆయన క్షమాపణలు చెప్పాలని అన్నారు.
షర్మిల పార్టీ మార్పు గురించి పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో ఆమె స్పందిస్తూ.. పార్టీ మారడం లేదని, తన మీద దృష్టిసారించే బదులు.. సీఎం కేసీఆర్ అవినీతి మీద ఫోకస్ చేయాలని కోరారు.