జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పర్యటనలో భాగంగా టాలీవుడ్ హీరోల గురించి ప్రస్తావించారు. వారాహిలో గోదావరి జిల్లాలను కవర్ చేస్తూ రైతులనుద్దేశించి ప్రసంగిస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం ఆగడాలను అందరం కలిసికట్టుగా అణచివేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ సర్కార్ కులాల మధ్య చిచ్చు పెడుతోందని, వాటిని తాను సహించబోనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణలో కొత్త పార్టీని ప్రకటించాడు. గద్దర్ ప్రజా పార్టీ అని తన పార్టీకి నామకరణం చేశాడు. రానున్న ఎన్నికల్లో తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని తెలిపాడు.
సీఎం జగన్ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీలో 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని, వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగున్న వారికే టికెట్ కేటాయిస్తానని స్పష్టం చేశారు. వచ్చే 9 నెలలు అత్యంత కీలకమని, అందరూ ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడాలని తెలిపారు. తీరు మార్చుకోని ఎమ్మెల్యేలను పార్టీ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. తన కుటుంబాన్ని కిడ్నాపర్లు దారుణంగా హింసించినట్లు తెలిపారు. క్రూరంగా ఇబ్బంది పెట్టి తమ నుంచి డబ్బులు లాక్కున్నారని, ఆ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
జూపల్లి కృష్ణారావు, అతని బృందం కాంగ్రెస్ పార్టీలోకి రావాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు రవి, చిన్నారెడ్డితో కలిసి జూపల్లి ఇంటికెళ్లి మరీ ఇన్వైట్ చేశారు.
ప్రధాని మోడీకి తాను పెద్ద ఫ్యాన్ అని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని తనను కోరానని, వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు.