తమిళనాడు(Tamilnadu) సర్కార్ మందుబాబుల(Drinkers)కు షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే 500 మద్యం దుకాణాల(Liquor Shops)ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ రిటైలర్ అయిన టాస్మాక్ ఈ విషయాన్ని బుధవారం వెల్లడించింది. మద్యం దుకాణాల మూతలో భాగంగా తొలి విడత పాఠశాలలు(Schools), ఆలయాల(Temples) సమీపంలో ఉన్న మద్యం షాపులను మూయనున్నారు. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లోని 500 మద్యం దుకాణాలను మూత వేయనున్నారు.
ఎన్నికల టైంలో స్టాలిన్ సారధ్యంలోని డీఎంకే(DMK) పార్టీ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగానే డీఎంకే అధికారంలోకి వచ్చాక దానిని అమలు చేస్తోంది. ఏప్రిల్ మాసంలోనే ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ మద్యం దుకాణాల మూసివేతపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
తమిళనాడు వ్యాప్తంగా మార్చి 31వ తేదికి 5329 రీటైల్ మద్యం దుకాణాలు(Liquor Shops) ఉన్నాయి. వాటిలో 500 దుకాణాలను మొదటి విడతలో తొలగించనున్నారు. జూన్ 22 నుంచి మద్యం దుకాణాల మూసివేత కొనసాగనుంది. తమిళనాడు(Tamilnadu) సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మక్కల్ కచ్చి (PMK) పార్టీ హర్షం వ్యక్తం చేసింది.