Sarpanch Navya: జానకీపురం సర్పంచ్ (Sarpanch Navya) నవ్య మళ్లీ తెరపైకి వచ్చారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Mla Rajaiah) వేధింపుల గురించి మరోసారి ప్రస్తావించారు. గతంలో లైంగిక వేధింపులు ఆరోపణలు చేసి.. తర్వాత సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన భర్తను (husband) ట్రాప్ చేశారని.. ఇస్తానని చెప్పిన నగదు ఇవ్వలేదని మీడియా ముందుకు వచ్చారు.
టేపులు ఇవ్వాలంటూ..
గతంలో తాను చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించి టేపులు ఇవ్వాలని ఎమ్మెల్యే రాజయ్య (mla rajaiah) ఒత్తిడి చేస్తున్నారని నవ్య చెబుతున్నారు. రూ.20 లక్షలు ఇస్తానని.. రాజీ చేసుకోవాలని బెదిరిస్తున్నారని తెలిపారు. గతంలో గ్రామ అభివృద్ది కోసం ఇస్తామని చెప్పిన రూ.20 లక్షలు ఇవ్వలేదని వివరించారు. గతంలో తాను చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారని.. బాండ్ రాసిస్తే రూ.20 లక్షలు ఇస్తామని అంటున్నారు నవ్య (navya) చెబుతున్నారు.
ట్రాప్ చేసి
తన భర్తను ఓ మహిళా ప్రజా ప్రతినిధితో ట్రాప్ చేయిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు నవ్య (navya). భార్య భర్తల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. రాజయ్య (Rajaiah) పీఏ చెప్పే మాటలు తన భర్త నమ్ముతున్నాడని నవ్య (navya) వివరించారు. రోజు తనను వేధిస్తున్నాడని కన్నీటి పర్యంతం అయ్యారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన తర్వాత తనకు సరైన గౌరవం దక్కడం లేదంటున్నారు. ఇంటా, బయట చులకనగా చూస్తున్నారని.. వెలివేసినట్టు చూస్తున్నారని ఆరోపించారు.
రూ.20 లక్షల అప్పు
ఎమ్మెల్యే రాజయ్య (mla rajaiah) పంపించిన బాండ్ పేపర్లో రూ. లక్షల అప్పు ఇస్తున్నట్టు ఉందని నవ్య అంటున్నారు. ఆ పేపర్‌పై సంతకం చేయాలని తన భర్త కూడా ఒత్తిడి చేస్తున్నాడని వాపోయారు. తన భర్త కూడా ఎమ్మెల్యేకు లొంగిపోయాడని వివరించారు. గతంలో జరిగిన గొడవకు సంబంధించి సెటిల్మెంట్ వ్యవహారంలో ఎమ్మెల్యే వద్ద ఓ దొర రూ. లక్షలు తీసుకున్నాడని నవ్య ఆరోపించారు. ఆ గొడవకు సంబంధించి ఆధారాలు త్వరలో బయటపెడతానని చెప్పారు. ఎవరినీ వదల.. భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని హాట్ కామెంట్స్ చేశారు.