Pawan Kalyan: ఏపీ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్రతో జనం ముందుకు వెళుతున్నారు. వైసీపీ నేతలపై విమర్శలు.. అటు నుంచి కౌంటర్ అటాక్ రావడంతో పాలిటిక్స్ సెగలు రేపుతోన్నాయి. ఇటీవల సీఎం అవుతా అని పవన్ కల్యాణ్ అంటున్నారు. దాని వెనక ఉన్న కారణాలు ఓ సారి విశ్లేషిస్తే.
సీఎం అంటూ..
ఇటీవల సభలు, సమావేశాల్లో అంతా తనను సీఎం అని సంభోదిస్తున్నారని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గుర్తుచేస్తున్నారు. తనను సీఎం అంటున్నారని.. ఆ పదవీ చేపట్టాలంటే అనుభవం కావాలని గుర్తుచేశారు. తనను సీఎం అభ్యర్థిగా పరిగణిస్తే సరిపోదని అంటున్నారు. పవన్ కామెంట్స్ వేళ.. కొన్ని ప్రభుత్వ అనుకూల మీడియా టీడీపీ- జనసేన మధ్య పొత్తు లేదని ప్రచారం చేశాయని అంటున్నారు. పవన్ ఏమో సీఎం పదవీ అవుతానని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం 175 సీట్లలో విజయం సాధిస్తామని ప్రకటన చేస్తున్నారు. ఇద్దరి ప్రకటన ఒక్కటే.. దీంతో ఏమైనా తేడా కొట్టిందా అనే సందేహాలు వస్తున్నాయి. ఇటీవల చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. ఆ సమావేశంలో సీఎం పదవీ గురించి చర్చకు వచ్చి ఉంటుంది.
ఓటు బ్యాంక్
ఎన్నికల సమయంలో తన పాపులారిటీ ఓటు బ్యాంకుగా మారకపోవడాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించారట. ఇతర పార్టీలకు మూడు తరాల ఓటర్లు ఉంటారు. జనసేనకు మాత్రం కొత్త ఓటర్లు ఉంటారు. వారిని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి, ఓట్లుగా ఎలా మలచుకోవాలనే అంశంపై పవన్ సమాలోచనలు చేస్తున్నారని తెలిసింది. ఇదీ జనసేన పార్టీకి మూడో దఫా ఎన్నిక.. ఈ సారి అయినా సత్తా చాటాలని అనుకుంటోంది. చంద్రబాబును మూడుసార్లు కలిసినప్పటికీ సీట్ల పంపకాలపై చర్చించలేదట. ఎన్నికల్లో పొత్తుపై కూడా డిస్కష్ చేయలేదని పవన్ చెబుతున్నారు. ఏపీ సమస్యలపై చర్చించామని.. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని జనసేన అధినేత అంటున్నారు.
బీజేపీ, సీబీఐ వేర్వేరు
బీజేపీతో వైసీపీ సఖ్యంగానే ఉంటోంది. జగన్ అక్రమాస్తుల కేసుల నేపథ్యంలో మిన్నకుండి పోతుంది. అదే సమయంలో జనసేన- బీజేపీతో కలిసి పనిచేయడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే అంశంపై జనసేనాని మీడియా అడిగితే.. బీజేపీ వేరు, సీబీఐ వేరు.. జగన్ కేసుల గురించి సీబీఐ చూసుకుంటుందని కవరింగ్ చేశారు.