CEC: తెలంగాణ అసెంబ్లీకి (Telangana assembly) మరి కొన్ని నెలల్లో నగారా మోగనుంది. షెడ్యూల్ ప్రకారం నవంబర్-డిసెంబర్లో (december) ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్లో షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఈ రోజు రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం బృందం రానుంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ఎన్నికల అధికారులతో సీఈసీ (CEC) బృందం సమావేశం అవనుంది. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించి కీలక సూచనలు చేయనుంది. ఈవీఎం పరిశీలన, ఓటర్ల తుది జాబితా తయారీ, భద్రతా ఏర్పాట్ల గురించి చర్చిస్తారు. నాలుగు రోజుల పాటు హైదరాబాద్లోనే (hyderabad) ఉంటారని విశ్వసనీయంగా తెలిసింది. కలెక్టర్లు (collectors), ఎస్పీలతోపాటు (sp) ఐటీ శాఖ అధికారులతో సమావేశం అవుతారట. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలో అధికారుల బృందం రానుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, డబ్బు పంపిణీ అరికట్టడం, ఎన్నికల సమయంలో కొట్లాట, దాడులు జరగకుండా చూడటంపై పోలీసులతో డిస్కష్ చేస్తారు. రాష్ట్రంలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుక అవలంభించిన విధానాలపై చర్చిస్తారు.
2018 ఎన్నికల సమయంలో అక్టోబర్ 6వ తేదీన (october 6th) ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి.. డిసెంబర్లో పోలింగ్ నిర్వహించారు. ఈ సారి కూడా అలానే ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్.. లేదంటే అక్టోబర్ 5-15 తేదీల మధ్య షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.