జనగాం బీఅర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేసిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి, చేర్యాల హాస్పిటల్కి తిరిగి ఇచ్చేందుకు ఆయన కూతురు తుల్జా భవాని నిర్ణయం తీసుకున్నారు. చేర్యాల పెద్ద చెరువు వద్ద గతంలో తుల్జా భవాని పేరిట ఉన్న 21 గంటల స్టలాన్ని తిరిగి ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ స్థలంపై గతంలో అనేక వివాదాలు, ఎమ్మెల్యేపై కబ్జా ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ భూమి తన పేరిట తన తండ్రి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని తుల్జాభవాని వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు రెండు సార్లు తన తండ్రి ఎమ్మెల్యే అయినా కూడా 70 ఏళ్ల వయసులో ఇలా చేయకూడదని ఆమె అన్నారు. ఆయనకు వెయ్యి కోట్ల ఆస్తి ఉంది. అలాంటి వ్యక్తి ఇలాంటి భూమి తీసుకోకూడదని పేర్కొన్నారు. తప్పు జరగిందని, క్షమించాలని ఈ భూమి తిరిగి ఇచ్చేస్తున్నట్లు వెల్లడించారు.