Khushbu: దారుణమైన స్థితిలో నటి ఖుష్బూ.. ఆస్పత్రి నుంచి ట్వీట్
కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలు, నటి ఖుష్బూ..తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఫోటో షేర్ చేశారు. త్వరలోనే కోలుకుని అందరి ముందుకు వస్తానని ట్వీట్ చేశారు.
సీనియర్ నటి, కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ(Khushbu) మరోసారి ఆస్పత్రిపాలయ్యారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్(Twitter) ద్వారా తెలియజేశారు. గత కొన్ని రోజులుగా ఖుష్బూ పలు అనారోగ్య కారణాల(Health Issues)తో తరచూ ఆస్పత్రికి వెళ్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఖుష్బూ(Khushbu) ఆస్పత్రిలో చేరారు.
ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఖుష్బూ:
On the road to recovery! Underwent a procedure for my coccyx bone ( tail bone ) yet again. Hope it heals completely. 🙏 pic.twitter.com/07GlQxobOI
ప్రస్తుతం ఖష్బూ(Khushbu) అటు రాజకీయాలతో(Politics), ఇటు అడపాదడపా సినిమాల(Movies)తో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా పలు టీవీ షోలలో మెరుస్తున్నారు. జబర్దస్త్ షోకు జడ్జి(Jabardasth Judge)గా కూడా ఖుష్బూ వ్యవహరిస్తున్నా సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఖుష్బూ దారుణమైన పరిస్థితిలో కనిపించారు. ఆస్పత్రి బెడ్ పై ఆమె చాలా నీరసంగా ఉన్న ఫోటోను షేర్(Hospital Photo Share) చేశారు.
ఆస్పత్రి బెడ్ పై సెలైన్ ఎక్కించుకుంటూ ఖుష్బూ(Khushbu) తన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. దాంతో ఖుష్బూకు ఏమైందని ఆమె ఫ్యాన్స్(Fans) ఆందోళన చెందుతున్నారు. అయితే తాను కోకిక్స్ బోన్ (టెయిల్ బోన్) చికిత్స కోసం ఆస్పత్రికి చేరినట్లుగా ఖుష్బూ తెలిపారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని, త్వరలోనే పూర్తిగా నయం అయ్యి అందరి ముందుకు వస్తానని ఖుష్బూ ట్వీట్(Tweet)లో పేర్కొన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తూ ట్వీట్ చేస్తున్నారు.