మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(ys viveka murder case)పై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. సీబీఐ(CBI) ఈ కేసును సీరియస్గా తీసుకుని విచారిస్తోంది. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy)ని శనివారం సీబీఐ మరోసారి ప్రశ్నించింది. ఆయన నేడు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయం(CBI Office)లో విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య కేసులో ఉన్న అనుమానాలపై సీబీఐ అధికారులు ఆయన్ని పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
విచారణలో భాగంగా అవినాశ్ రెడ్డి(Avinash Reddy) ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ కార్యాలయం(CBI Office)లోనే ఉన్నారు. 5 గంటల తర్వాత ఆయన సీబీఐ కార్యాలయం నుంచి తన నివాసానికి బయల్దేరి వెళ్లారు. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని ఇప్పటికీ అనేక పర్యాయాలు సీబీఐ విచారించింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో సీబీఐ ఆయన్ని అరెస్ట్ చేయలేదు. ప్రస్తుతం ఈ కేసు విషయంలో ఆయన ఇంకొన్నిసార్లు సీబీఐ విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ తెలిపింది.