»Important Decision Of Ap Sarkar Notification For Formation Of New Sub Districts Is Issued
AP – Sub Districts : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ
ఏపీలో కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తూ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీలో భూముల రీసర్వే, రిజిస్ట్రేషన్ సేవల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
ఏపీ సర్కార్(Ap Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌ల(New Sub Districts) ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల(Notification Release) చేసింది. రాష్ట్రంలోని అనకాపల్లి (Anakapalle), చిత్తూరు (Chittoor), కృష్ణా, మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, కడప, కోనసీమ, ఏలూరు, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ సర్కార్ తెలిపింది. వాటికి సంబంధించిన ఉత్తర్వులిస్తూ ప్రకటన చేసింది.
ఏపీలో భూముల రీసర్వే తర్వాత పాలన, పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత వేగవంతం చేయనున్నట్లు ఏపీ సర్కార్ తెలిపింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని, కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌ల(New Sub Districts)ను ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇవ్వడం(Notification Release)తో ఆయా సబ్ డిస్ట్రిక్ట్‌లలోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధి గురించి స్పష్టత వచ్చింది.
దీంతో కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌ల(New Sub Districts)లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు జగన్(Cm Jagan) ప్రభుత్వం తెలిపింది. రిజిస్ట్రేషన్ల చట్టం 1908, సెక్షన్ 5 కింద సబ్ డిస్ట్రిక్ట్‌ల ఏర్పాటు చేయనుంది. ఇకపై నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రాంతాలు అన్నీ కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌ల పరిధిలో ఉంటాయని ఏపీ సర్కార్(Ap Government) వెల్లడించింది.