Leopard: తిరుమల నడక మార్గంలో ఓ బాలుడిపై చిరుతపులి (Leopard) దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ బాలుడికి (boy) ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు ప్రకటించారు. ఆ చిరుతపులి పులి కోసం అటవీ అధికారులు రెండు బోన్లను ఏర్పాటు చేశారు. 150 ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు (cc camera) ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి (శుక్రవారం) 10.45 గంటల సమయంలో బోనులో చిరుత పడింది. బాలుడిపై దాడి చేసిన ఒక్క రోజులో చిరుతను (Leopard) బంధించామని డీఎఫ్వో తెలిపారు. తల్లి, పిల్ల చిరుతలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయని పేర్కొన్నారు.
షాపు వద్ద ఉండగా..
తిరుమల నడక మార్గంలో 7వ మైలు వద్ద చిరుతపలి (Leopard) బాలుడిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. తాతతో కలిసి అక్కడ ఉన్న షాపులో కొనుక్కునే సమయంలో ఓ చిరుత పులి వచ్చింది. బాలుడి మెడ పట్టుకుని ఎత్తుకెళ్లింది. వెంటనే అక్కడ ఉన్న షాప్ ఓనర్, తాత, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనకాల పరుగు తీశారు. టార్చ్ వేస్తూ.. రాళ్లు విసిరారు. 7వ మైలు కంట్రోల్ రూమ్ వద్ద బాలుడిని వదిలేసి వెళ్లిపోయింది. అక్కడి నుంచి ఆ పిల్లాడిని భద్రతా సిబ్బంది తీసుకొచ్చారు.
మెరుగైన చికిత్స
గాయపడ్డ బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలో గల శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని చోట్ల చిరుత దంతం చేసిన గాయాలు ఉన్నాయి. బాలుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఆ బాలుడు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కౌషిక్ అని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి బాలుడిని పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు సూచించారు.
గుంపులు గుంపులుగా
చిరుత (Leopard) దాడిచేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తామని వివరించారు. దాంతో చిరుతపులుల అటు వైపు వచ్చేందుకు జంకుతాయని చెబుతున్నారు. ఒకరు, ఇద్దరు ఉంటే రెప్పపాటులో వచ్చి, దాడి చేసి వెళ్తున్నాయని పేర్కొన్నారు.