Roof and Floor: ఆన్ లైన్ రియల్టీ వెబ్ పోర్టల్ రూఫ్ అండ్ ప్లోర్.కామ్ (Roof and Floor) ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. హైటెక్ సిటీలో గల మేదాన్ ఎక్స్ పో సెంటర్ వద్ద ఈ రోజు ప్రారంభం అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రదర్శన ఉంటుంది. రేపు కూడా ప్రాపర్టీ షో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ప్రాపర్టీ షోకు (Property Show) వెళ్లొచ్చు.. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. ఉచితంగా ప్రవేశం కల్పించారు.
ప్రాపర్టీ షో ద్వారా ఇళ్లు (home) కొనాలి అనుకునేవారు, డెవలపర్లను అనుసంధానిస్తారు. ఇద్దరికీ ఇది సరైన వేదిక అని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రాపర్టీ షోలో అపర్ణ కన్స్ట్రక్షన్స్, వాసవి గ్రూప్, శేత్రా ఫామ్స్, సెన్సేషన్ ఇన్ఫ్రాకాన్, జీ స్క్వేర్, రిధిరా లైఫ్ స్పేసెస్, ఎన్సీసీ అర్బన్, శిల్పా ఇన్ ఫ్రా, జీకే బిల్టర్స్, ప్రణీత్ గ్రూప్, శాంతా శ్రీరాం, వజ్ర, గోల్డెన్ కీ ప్రైమ్ ప్రాపర్టీస్, వీటితోపాటు కెనరా బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. కన్ స్ట్రక్షన్స్ కంపెనీలు, బ్యాంక్ ప్రతినిధులు ఓకే చోట ఉండి.. ఇళ్లు కొనాలి అనుకునే వారికి అక్కడే వివరించి, లోన్ (loan) సౌకర్యం కూడా కల్పిస్తారు. హైదరాబాద్ సిటీ వేగంగా విస్తరిస్తోంది. ఐటీ ప్రాజెక్టులు, ఐటీ కారిడార్ పేరుతో నలువైపులా విస్తరణ జరుగుతోంది. కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ మంచి భూమ్ మీద ఉంది.