తన కోసం సుపారీ గ్యాంగులు తిరుగుతున్నయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. నిన్న రాజోలులో తనపై కొంతమంది దాడికి ప్రయత్నించారని ఆయన తెలిపారు. తనపై దాడి చేసేందుకు రాళ్లు పట్టుకొని నలుగురు తిరిగారన్నారు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని చెప్పారు. తన ద్వారా ప్రజల్లో మార్పు వస్తోందని అధికారంలో ఉన్నవాళ్లు ఉలిక్కిపడుతున్నారని దుయ్యబట్టారు. అంతకు ముందు పి గన్నవరం (P Gannavaram) నియోజకవర్గ పార్టీ నాయకుల సమావేశంలో పవన్ మాట్లాడారు.
వైసీపీ పాలన నుండి ఉభయ గోదావరి జిల్లాలను విముక్తం చేయాలన్నారు.రాజోలలో (Rajolalo) నాయకుడు వెళ్లిపోయినా పార్టీ శ్రేణులు అండగా నిలబడ్డాయని పార్టీ నుండి గెలిచి వైసీపీ (YCP) వైపు వెళ్లిన ఎమ్మెల్యేను ఉద్దేశించి అన్నారు. ఇక్కడి వారు ఇచ్చిన ప్రేరణతోనే వారాహి యాత్ర(Varahi Yatra)ను ప్రారంభించినట్లు చెప్పారు.రాజకీయాల్లో మార్పు తీసుకు వస్తామంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్లిపోయాడన్నారు. ఉభయ గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. గోదావరి జిల్లాలలో తమకు 18 శాతం మంది ఓటు వేశారన్నారు. జనసేన (Janasena) కు 20 లక్షల మంది ఓటు వేశారని చెప్పారు. ఎమ్మెల్యే పార్టీ నుండి వెళ్లిపోయినా జనసైనికులు, ప్రజలు అండగా ఉన్నందుకు ఆనందంగా ఉందన్నారు