హైదరాబాద్లో భారీ వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్(Jubilee Hills), బంజారాహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. ప్రస్తుతం నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు(stormy winds), ఉరుములతో కూడిన వర్షం పడింది. ఆఫీసుల నుంచి ఇంటికి బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి (Heavy rain)రహదారులు జలమయమవ్వడంతో భారీగా ట్రాఫిక్ జాం (Traffic jam) అయింది. నగరంలో సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం (weather)మారింది. కుండపోత వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొద్ది రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే హడలెత్తిపోయేవారు. అలాంటిది ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో భాగ్యనగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.