»Tdp Leaders Speech Collapsed Stage At Nuziveedu Eluru
Stage Collapsed: ఆ నేత ప్రసంగం..కుప్పకూలిన సభావేదిక
టీడీపీ బహిరంగ సభ వేదిక ఒక్కసారిగా కూలిపోగా దానిపై కూర్చున్న 10 మందికిపైగా నేతలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఏపీ ఏలూరు జిల్లాలోని నూజివీడు పరిధిలో చోటుచేసుకుంది.
బహిరంగ సభ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ప్రతిపక్ష నేతలు టీడీపీకి చెందిన పది మంది నాయకులు, కార్యకర్తలు కూర్చున్న వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడులో బత్తులవారిగూడెంలో చోటుచేసుకుంది. ‘భవిష్యత్తుకు హామీ కార్యక్రమం’ పేరుతో టీడీపీ బహిరంగ సభ నిర్వహించిన క్రమంలో ఇది జరిగింది.
సభావేదికపై మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా ఈదురు గాలులు వచ్చాయి. ఆ క్రమంలో వేదిక కూలిపోవడంతో వేదికపై ఉన్న సుమారు 15 మంది నాయకులు కిందపడ్డారు. దీంతో కూర్చున్న వారిలో 10 మంది నేతలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో టీడీపీ నాయకులు నిమ్మకాయల చిన్నరాజప్ప, చింతమనేని ప్రభాకర్, పీతల సుజాత తదితరులకు గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారిని ఫోన్ ద్వారా పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు.
కుప్పకూలిన టీడీపీ స్టేజ్
ఏలూరు – నూజివీడులో టిడిపి భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్రలో అపశృతి. ఈదురుగాలులు, భారీ వర్షం రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిన స్టేజ్.
స్టేజి పైన ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఘంటా మురళీ పలువురు టిడిపి శ్రేణులకు స్వల్ప గాయాలు pic.twitter.com/vFap2IgD9S