Video call to Facebook friend.. Groom who says no to marriage
Video call: సోషల్ మీడియాతో (social media) యువత కంట్రోల్ తప్పుతున్నారు. ఫేస్ బుక్, ఇతర యాప్స్ ద్వారా ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన యువతికి కర్రా న్యూటన్ బాబు మధ్య ఎఫ్బీ ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. క్లోజ్ కావడంతో.. ఆమె నగ్నంగా వీడియో కాల్ చేసింది. దీనిని అతడు రికార్డ్ చేశాడు. తర్వాత ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన గుర్రం పరంజ్యోతితో యువతి పెళ్లి ఖాయమైంది. కాబోయే భర్త అని అతనితో శారీరకంగా దగ్గర అయ్యింది.
పరంజ్యోతితో యువతి పెళ్లి ఈ నెల 14వ తేదీన జరగాల్సి ఉంది. ఇంతలో పెళ్లి కొడుకు పరంజ్యోతికి న్యూటన్ బాబు న్యూడ్ వీడియోను పంపించాడు. ఆ వీడియోను పరంజ్యోతి పెళ్లి కుదిర్చిన పెద్దలకు పంపి.. తనకు పెళ్లి వద్దని చెప్పాడు. పెళ్లి పెద్ద గుర్రం జాషువా జ్యోతి ఆ వీడియోను యువతికి సెండ్ చేసి.. పెళ్లి కుదరదు అని తెలిపాడు. న్యూటన్ బాబు బంధువులు బాపట్ల కోటేశ్వరరావు, కొండ్రు రణధీర్ కూడా వీడియోను కొందరికి పంపించినట్టు పోలీసులు గుర్తించారు. వారి వివరాలను పోలీసులు సేకరించి కేసు నమోదు చేశారు.
న్యూడ్ వీడియో తీసిన న్యూటన్ బాబుపై లైంగికదాడి కేసు, పరంజ్యోతిపై అత్యాచారం కేసు, జాషువా జ్యోతి, కోటేశ్వరరావు, రణధీర్పై 109, 120 (బీ) కింద కేసులు నమోదు చేశారు. వ్యక్తిగత నగ్న వీడియోలు పంపితే వాటిని డిలీట్ చేయాలని.. సోషల్ మీడియాలో షేర్ చేస్తే జైలు శిక్ష తప్పదని పోలీసులు చెబుతున్నారు.