Magunta srinivasulu reddy:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) కవితను అనుసరిస్తున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన కూడా హాజరుకాలేదు. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) చెన్నైలో ఉన్నట్టు తెలుస్తోంది.
Bandi Sanjay:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (kavitha) బండి సంజయ్ (bandi sanjay) చేసిన కామెంట్లు దుమారం రేపాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ (telangana state woman commission) ఎదుట ఈ రోజు బండి సంజయ్ (bandi sanjay) విచారణకు హాజరయ్యారు. అక్కడ బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటా పోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Budha Venkanna : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన వ్యక్తి విజయం సాధించడంతో.... ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి మంచి రోజులు వస్తున్నాయని చెబుతున్నారు.
KTR:ఇద్దరు వ్యక్తుల చేసిన తప్పుతో లీకేజ్ జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి కాదు.. వారి వెనక ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. ఇదీ వ్యవస్థ తప్పు కాదు.. ఇద్దరు చేసిన తప్పు అని పేర్కొన్నారు.
Politics in Telangana has reached wall:తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గోడలకు (wall) ఎక్కాయి. గోడలపై (wall) పోస్టర్లు (posters) వెలిశాయి. బీఎల్ సంతోష్ (santosh) ఎక్కడ అని ఇటీవల పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. ఇప్పడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోస్టర్లు (kavitha posters) దర్శనం ఇచ్చాయి.
TSPSC పేపర్ల లీకేజీ వ్యవహారానికి సీఎం కేసీఆర్(CM KCR) నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా(resign) చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(etela Rajender) డిమాండ్ చేశారు. ఈ లీకేజీల నేపథ్యంలో సిరిసిల్లలో నవీన్ అనే విద్యార్థి మృతి చెందినా కూడా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TSPSC BOARD CANCEL:పేపర్ లీక్ అంశం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. కమిషన్ చైర్మన్ జనార్థన్ రెడ్డిని (janardhan reddy) ప్రగతి భవన్ పిలిపించారు. పేపర్ లీకేజీ అంశంపై జనార్థన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఆగ్రహాం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
Bandi sanjay:మహిళా కమిషన్ విచారణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చారు. ఇటీవల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సెషన్ నేపథ్యంలో 18వ తేదీన హాజరవుతానని చెప్పి.. ఈ రోజు విచారణకు హాజరయ్యారు.
KTR : బండి సంజయ్ కి మతి లేదని కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు గాను కేటీఆర్ ఇలా స్పందించడం గమనార్హం. ప్రభుత్వాల పనితీరు, ప్రభుత్వ వ్యవస్థల గురించి అవగాహన లేని మతిలేని నాయకుడు బండి సంజయ్ అని కేటీఆర్ మండిపడ్డారు.
స్వల్నలోక్ ఫైర్ యాక్సిడెంట్(Swapnalok Fire Accident)పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ramgopal varma) స్పందించారు. అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు. ఆ కాంప్లెక్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. తాను నాగార్జున(Nagarjuna)తో తీసిన శివ సినిమా క్లైమాక్స్(Shiva Movie Climax)ను స్వప్నలోక్ కాంప్లెక్స్ పైనే చిత్రీకరించినట్లు తెలిపారు. సినిమా చివరలో నాగార్జున, రఘువరన్ మధ్య వచ్చే ఫైటింగ్ సీన్స...
Minister Atishi:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia) బంగ్లాను నూతన మంత్రి అతిషికి (Atishi) కేటాయించారు. ఈ మేరకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఈ నెల 14వ తేదీన అతిషికి లేఖ రాసింది.
Hatsap to Sunita:వైఎస్ వివేకానంద (YS viveka) హత్య కేసులో అతని కూతురు సునీత (sunitha) పోరాటాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghu rama krishna raju) ప్రశంసించారు. అద్వితీయంగా పోరాడారని, ఇక అవినాశ్ (avinash) అరెస్ట్ తప్పదని ఇండైరెక్టుగా కామెంట్ చేశారు.
Pawan Kalyan : అధికార పార్టీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని పవన్ పేర్కొన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతి నగరంలో ఇటీవల బలిజ సమాజిక వర్గానికి, యాదవ సామాజిక వర్గానికి మధ్య చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
Group-1 prelims cancel:గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్‌ను టీఎస్‌పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. దీంతోపాటు ఏఈ పరీక్ష (AE Exam), డీఏవో పరీక్షలను రద్దు చేసింది. ఇంతకుముందే టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్ పేపర్లను రద్దు చేసింది.
YS Avinash:ఏపీ సీఎం జగన్‌ను ఆ పార్టీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆదేశాలు జారీ చేయలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో జగన్‌ను అవినాశ్ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.