»Ys Viveka Murder Case Shock To Ys Avinash Reddy In High Court
YS Viveka murder case: తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డికి గట్టి షాక్
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) విచారణ ఎదుర్కొంటున్న కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాశ్ రెడ్డికి (kadapa mp ys avinash reddy) శుక్రవారం తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) గట్టి షాక్ తగిలింది.
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) విచారణ ఎదుర్కొంటున్న కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాశ్ రెడ్డికి (kadapa mp ys avinash reddy) శుక్రవారం తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) గట్టి షాక్ తగిలింది. తనపై సీబీఐ (CBI) కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ వేసిన పిటిషన్ ను హైకోర్టు (High Court) కొట్టి వేసింది. అవినాశ్ రెడ్డికి (ys avinash reddy) తదుపరి విచారణ పైన స్టే (stay on cbi investigation) ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ కేసు దర్యాఫ్తును కొనసాగించవచ్చునని సీబీఐకి (CBI) అనుమతిస్తూ విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారించే చోటుకు న్యాయవాదిని అనుమతించలేమని వెల్లడించింది. విచారణకు సహకరించాలని అవినాశ్ రెడ్డికి ఆదేశించింది. అరెస్ట్ చేయవద్దని తాము చెప్పలేమని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.
పిటిషన్ ఏమని దాఖలు చేశారు?
ఈ కేసులో భాగంగా సీబీఐ తన వాంగ్మూలాన్ని నమోదు చేస్తోందని, తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని అవినాశ్ రెడ్డి వారం క్రితం కోర్టును ఆశ్రయించారు. తనను విచారించే సమయంలో ఆడియో, వీడియోల ద్వారా రికార్డ్ చేయకపోవడాన్ని సవాల్ చేసారు. జనవరి 28, ఫిబ్రవరి 24న సీబీఐ సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని అభ్యర్థించినా చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డ్ చేసేలా ఆదేశించాలని కోరారు. విచారణ సమయంలో లాయర్ ను అనుమతించాలని కోరారు. తన వాంగ్మూలానికి సంబంధించిన ప్రతులను అందజేసేలా దర్యాఫ్తు అధికారిని ఆదేశించాలన్నారు. తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరారు. రెండు ఛార్జీషీట్లు దాఖలు చేసిందని, వీటి ప్రకారం హత్య పైన గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లుగా ఆధారాలు లేవని పేర్కొంది. అవినాశ్ రెడ్డి సీబీఐ ఇప్పటికే నాలుగుసార్లు పిలిపించి ప్రశ్నించింది. ఆయన తండ్రితో కలిపి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు కీలక నిందితులని, అరెస్ట్ చేయడం ఖాయమని భావిస్తున్నారు.