TSPSC BOARD CANCEL:పేపర్ లీక్ అంశం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. లీకేజీకి సంబంధించి పూటకో అప్ డేట్ వస్తోంది. కేసు విచారణ చేపట్టిన సిట్ (SIT) నివేదిక అందజేసిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగా 5 పేపర్లను (5 papers) రద్దు చేశారు. గ్రూప్-1 నిర్వహించే తేదీని ప్రకటించారు. మిగతా పరీక్షల డేట్ ఇవ్వాల్సి ఉంది. సీఎం కేసీఆర్ (cm kcr) ప్రగతి భవన్లో ఈ రోజు మంత్రులు కేటీఆర్ (ktr), హరీశ్ రావుతో (harish rao) సమావేశం అయ్యారు. పేపర్ లీకేజీ అంశంపై వారితో మాట్లాడారు. కమిషన్ చైర్మన్ జనార్థన్ రెడ్డిని (janardhan reddy) అక్కడికి పిలిపించారు. పేపర్ లీకేజీ అంశంపై జనార్థన్ రెడ్డిపై ఆగ్రహాం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను (kcr) జనార్దన్ రెడ్డి కలిశారు. అక్కడ కేటీఆర్ (ktr), హరీశ్ రావు (harish rao), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (shanti kumari), పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణ, తదుపరి ఏం చేయాలనే అంశంపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ భేటీ తర్వాత బోర్డు రద్దు చేయాలనే నిర్ణయం సీఎం కేసీఆర్ తీసుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ 2017లో జూనియర్ అసిస్టెంట్‌గా (junior assistant) చేరాడు. టీఎస్ పీఎస్సీ వెరిఫికేషన్ విభాగంలో పనిచేసిన సమయంలో.. అప్లికేషన్లలో వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చిన మహిళలతో (woman) మాట కలిపేవాడట. సమస్య పరిష్కరించి.. వారి నంబర్ తీసుకునేవాడట. కొందరితో సంబంధం కూడా పెట్టుకున్నట్టు తెలిసింది. ప్రవీణ్ (praveen) రాసలీలల గురించి సిట్ అధికారులు కూపీ లాగారు. టీఎస్ పీఎస్సీకి (ts psc) వచ్చే మహిళలను అతను ట్రాప్ చేశాడని అధికారులు గుర్తించారు. 40 మంది (40) మహిళలతో అతను చాట్ చేశాడని పేర్కొన్నారు. మహిళలతో పరిచయం పెంచుకొని.. వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడాలని ప్రవీణ్ ఒత్తిడి చేశాడట.
పేపర్ లీకేజ్ ఇష్యూలో రేణుక కూడా ప్రధాన పాత్ర పోషించారట. ఆమె ప్రవీణ్‌కు రూ.10 లక్షలు ఇచ్చి మరీ ఏఈ పేపర్ తీసుకుందని తెలిసింది. తమ్ముడి పేరు చెప్పి ఇతరులకు విక్రయించింది. ఇద్దరి నుంచి రూ.14 లక్షలు తీసుకుని.. రూ.10 లక్షలు ప్రవీణ్‌కు ఇచ్చేసింది.