Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (delhi liquor scam) కల్వకుంట్ల కవితపై (kavitha) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ed) అధికారులు ప్రశ్నల వర్షం కురుపిస్తోన్నారు. ఈ రోజు ఉదయం నుంచి.. దాదాపు 9 గంటల నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు. సాయంత్రం ఏజీ వెళ్లడంతో హైటెన్షన్ నెలకొంది. కవిత లాయర్లు గండ్ర మోహన్, భరత్.. వైద్యులు.. అందులో ఒక మహిళ ఉండటంతో ఇక అరెస్ట్ తప్పదనే ప్రచారం జరిగింది.
Pawan Kalyan : అసెంబ్లీలో టీడీపీ నేతలపై దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం సభలో జీవో నెంబర్ 1పై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. అయితే టీడీపీ సభ్యుల తీరుపై వైస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు కూడా పోడియం వద్దకు వెళ్లారు.
Revanth reddy:పేపర్ లీకేజ్ అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. లీకేజీ గురించి కామెంట్స్ చేసిన టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (Revanth reddy) సిట్ (sit) నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాదయాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి (Revanth reddy) ఓ ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి దీక్ష చేపడతారట.
ktr:ప్రధాని మోడీపై (modi) మంత్రి కేటీఆర్ (ktr) ఫైరయ్యారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గినా.. పెట్రోల్ ధర ఎందుకు తగ్గడం లేదని అడిగారు. ఈ మేరకు ధర వివరాల డేటాతో సహా ఆయన వివరించారు. 2014 మే నెలలో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 107 డాలర్లు ఉంటే.. లీటర్ పెట్రోల్ (petrol) ధర రూ.71 ఉండేదని గుర్తుచేశారు.
CPI Narayana : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన సంఘటనపై సీపీఐ నారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటని ప్రశ్నించారు. వారు మనుషులా? పశువులా? అని నిలదీశారు. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదని నారాయణ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు రాజశేఖర్ పైన పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఆయన భార్య సుచరిత ఆరోపించారు. తన భర్తకు వైద్య పరీక్షలు చేయించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాజశేఖర రెడ్డిని కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించినట్లు పోలీసు శాఖ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసు సోమవారం కీలక మలుపు చోటు చేసుకున్నది. ఈ లీకేజీ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాఫ్తు చేస్తోంది. లీకేజీ పైన ఆరోపణలు చేసిన రాజకీయ నాయకులకు సిట్ నోటీసులు అందిస్తోంది.
అసెంబ్లీలో ఇష్టారీతీన వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హద్దు మీరితే శాశ్వతంగా చట్ట సభలకు రాకుండా చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మంత్రి ఆర్కే రోజా సోమవారం డిమాండ్ చేశారు.
YS Bhaskar reddy:మాజీ మంత్రి వైఎస్ వివేకానంద (vivekananda) హత్య కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. వివేకా కేసులో ఏ-4 దస్తగిరిని అఫ్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ కేసులో దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా సీబీఐ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని సీబీఐ విచారిస్తోన్న సంగతి తెలిసిందే.
Nama : బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ, అభివృద్ధి కార్యక్రమాలకు పిలవడం లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను పార్టీ దూరం పెడుతోందనే అర్థం వచ్చేలా ఆయన కామెంట్స్ చేయడం గమనార్హం. తనను ఎక్కడికి పిలిచినా వస్తానని ఆయన అన్నారు.
అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేల పైన జరిగిన దాడిని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. శాసన సభలోనే ఎమ్మెల్యేల పైన దాడి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు చీకటి రోజు అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వానికి పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి (Chief Minister), తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (trinamool congress) అధినేత్రి మమతా బెనర్జీ (mamata banerjee) నో చెప్పారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Excise Policy Case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) సోమవారం ( మార్చి 20) ఈడీ ఎదుట విచారణకు (enforcement directorate inquiry) హాజరు అయ్యారు.
పవిత్రమైన నిండు సభలో సభ్యులపై వైఎస్సార్ సీపీ దాడులకు పాల్పడిందని టీడీపీ సభ్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించాడు. తన రౌడీయిజాన్ని అసెంబ్లీలో కూడా వైసీపీ చూపిస్తోందని మండిపడ్డాడు. బయటకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.
తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయడు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ లు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు.