»Bjp Mla Etela Rajender Demand Kcr Should Resign Out Of Moral Responsibility On Tspsc Paper Leaked
Etela Rajender: కేసీఆర్ నైతిక బాధ్యతతో రాజీనామా చేయాలి
TSPSC పేపర్ల లీకేజీ వ్యవహారానికి సీఎం కేసీఆర్(CM KCR) నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా(resign) చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(etela Rajender) డిమాండ్ చేశారు. ఈ లీకేజీల నేపథ్యంలో సిరిసిల్లలో నవీన్ అనే విద్యార్థి మృతి చెందినా కూడా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TSPSC పేపర్ల లీకేజీ(tspsc paper leaked) వ్యవహారానికి సీఎం కేసీఆర్(CM KCR) నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా( resign) చేయాలని బీజేపీ(BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్(etela Rajender) డిమాండ్ చేశారు. ఈ లీకేజీల నేపథ్యంలో సిరిసిల్లలో నవీన్ అనే విద్యార్థి మృతి చెందినా కూడా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఫాం హౌంస్ లో ఉంటాడు తప్ప..ప్రజలు, విద్యార్థుల మరణాలపై పట్టింపు ఉండదని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వం మెడలు.. వచ్చే ఎన్నికల్లో వంచుతామని ఈటల వ్యాఖ్యానించారు.
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు ప్రశ్నపత్రాలు లీకైనా కూడా కేసీఆర్(KCR)కు సోయి లేదంటే ఏమనుకోవాలని ఈటల అన్నారు. పెద్దల హస్తం లేకుండా ఎలా పెన్ డ్రైవ్లో ప్రశ్నపత్రాలు తీసుకెళ్లారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి క్రమంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంపై కేసీఆర్ సమీక్ష చేస్తున్నారు కానీ..విద్యార్థుల ఆవేదన మాత్రం అతనికి అర్థం కావడం లేదన్నారు. అందుకే ఈ ప్రభుత్వంపై మీరైనా చర్యలు తీసుకోవాని తెలంగాణ గవర్నర్ తమిళిసై(governor tamilisai)ని కలిసి మోమోరండం ఇచ్చినట్లు ఈటల(etela) స్పష్టం చేశారు. గవర్నర్(governor)ను కలిసిన వారిలో బూర నర్సయ్య గౌడ్, డీకే అరుణ, మర్రి శశిధర్ రెడ్డి, రాంచందర్, విఠల్ ఉన్నారు.
మరోవైపు ఈకేసు దర్యాప్తును సిట్టింగ్ జడ్జ్ చేత విచారణ జరిపించాలని ఈటల కోరారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్(KCR)కు ఏమాత్రం చిత్త శుద్ధి ఉన్నా కూడా రాజీనామా( resign) చేయాలని కోరారు. దీంతోపాటు TSPSC ఛైర్మన్, బోర్డు సభ్యులు అందరూ రాజీనామా చేయాలన్నారు. రాబోయే కాలంలో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఇలాంటి సంఘటనల వేళ తెలంగాణ యువత(telangana youth) సూసైడ్ చేసుకోవద్దని ఈటల కోరారు.