mlc elections AP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్కు షాక్, బాలకృష్ణ ఏమన్నారంటే
ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (andhra pradesh graduate, Teacher mlc elections) తెలుగు దేశం పార్టీ (Telugu Desam party) జోరు మీద ఉన్నది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు ముందంజలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (andhra pradesh graduate, Teacher mlc elections) తెలుగు దేశం పార్టీ (Telugu Desam party) జోరు మీద ఉన్నది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు ముందంజలో ఉన్నారు. తన సమీప, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ పైన 23 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఉన్నారు. టీడీపీ అభ్యర్థికి దాదాపు 70వేల ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థికి 47వేల ఓట్లు వచ్చాయి. పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు 30 వేలు, బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ కు 7వేలకు పై చిలుకు ఓట్లు వచ్చాయి. మొత్తం ఎనిమిది రౌండ్లు కాగా, ఆరు రౌండ్లు పూర్తయ్యాయి. మరో రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉండటం, మెజార్టీ భారీగా ఉండటంతో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని భావిస్తున్నారు.
తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ దాదాపు 17వేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు. టీడీపీ అభ్యర్థికి 82,260 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డికి 65,121 ఓట్లు వచ్చాయి. పీడీఎఫ్ అభ్యర్థికి 22వేలు, బీజేపీ అభ్యర్థికి 3500 ఓట్లు వచ్చాయి.
వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైసీపీ ముందంజలో ఉంది. ఇక్కడ ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ బలపరిచిన రవీంద్ర రెడ్డి రెండువేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. టీడీపీ అభ్యర్థికి 45 వేలు, వైసీపీ అభ్యర్థికి 47వేల ఓట్లు వచ్చాయి.
అనంతపురం ఉపాధ్యాయ ఎన్నికల్లో మాత్రం వైసీపీ గెలిచింది. ఆ పార్టీ బలపరిచిన రామచంద్రా రెడ్డి 169 ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. మూడో ప్రాధాన్యత ఓటుతో ఆయన గెలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లెక్కింపు కూడా పూర్తయింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర రెడ్డి రెండువేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పట్టభద్రుల స్థానాల్లో హోరాహోరీ కనిపిస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికలపై బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందన్నారు. ఆయన వాహనంలో వెళ్తుండగా… టీడీపీ అభిమానులు కలిసి.. సార్.. సార్ మనకు రెండు ఎమ్మెల్సీలు వచ్చాయి.. అని చెప్పారు. దానికి బాలయ్య హ… అంటూ థంబ్ చూపిస్తూ… వచ్చింది తిరగబాటు జనంలో… అన్నారు.