KTR : బండి సంజయ్ కి మతిలేదు… కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..!
KTR : బండి సంజయ్ కి మతి లేదని కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు గాను కేటీఆర్ ఇలా స్పందించడం గమనార్హం. ప్రభుత్వాల పనితీరు, ప్రభుత్వ వ్యవస్థల గురించి అవగాహన లేని మతిలేని నాయకుడు బండి సంజయ్ అని కేటీఆర్ మండిపడ్డారు.
బండి సంజయ్ కి మతి లేదని కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు గాను కేటీఆర్ ఇలా స్పందించడం గమనార్హం. ప్రభుత్వాల పనితీరు, ప్రభుత్వ వ్యవస్థల గురించి అవగాహన లేని మతిలేని నాయకుడు బండి సంజయ్ అని కేటీఆర్ మండిపడ్డారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రభుత్వ శాఖ కాదని.. అది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అన్న కనీస అవగాహన బండి సంజయ్ కి లేదని కేటీఆర్ విమర్శించారు.
ఒక వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా రాజకీయాలను చేస్తున్న దగుల్బాజీ నేత బండి సంజయ్ అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రయోజనాల కోసం .. యువత ఉద్యోగాల ప్రిపరేషన్ పక్కన పడేయాలన్న దుర్మార్గుడు బండి సంజయ్ అని కేటీఆర్ విమర్శించారు. నిరుద్యోగుల పట్ల తమ నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదని కేటీఆర్ అన్నారు.
బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇప్పటికే వంద సార్లకు పైగా ప్రశ్నాపత్రం లీక్ అయ్యాయని కేటీఆర్ గుర్తుచేశారు. స్వయంగా ప్రధాని మోడీ రాష్ట్రం గుజరాత్ లో 13 సార్లు క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యాయని కేటీఆర్ గుర్తుచేశారు. మరి ప్రధాని మోడీని రాజీనామా అడిగే దమ్ము బండి సంజయ్ కు ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. నిరుద్యోగ యువకుల ప్రయోజనాలు కాపాడటమే మా ప్రభుత్వం లక్ష్యమని కేటీఆర్ అన్నారు. ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను టీఎస్పీఎస్సీ కి అందిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రెచ్చగొట్టే రాజకీయ పార్టీల కుట్రల్లో భాగం కాకుండా, ఉద్యోగాల సాధన పైనే యువత దృష్టిపెట్టాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.