AP Minister : తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు.. ఏపీలో తీవ్ర దుమారమే రేపాయి. అందుకే... ఏపీ అధికార పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు రెచ్చిపోతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులను ఇష్టమొచ్చినట్లుగా తిట్టిపోస్తున్నారు. తాజాగా... ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు.. హరీష్ రావును ఘోరంగా విమర్శించారు.
Mahesh Goud : సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చి బీజేపీలో చేరారు. ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో ఆయన కమలం గూటికి చేరారు. కాగా మహేశ్వర్ రెడ్డి పార్టీని వీడడం ఫై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.
Perni Nani : విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ మధ్య గట్టి చిచ్చే పెట్టింది. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఇటీవల హరీష్ రావు చేసిన కామెంట్స్ కి.. తాజాగా ఏపీ మంత్రులు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. మామ కెసిఆర్ పై ఎప్పుడు కడుపు రగిలినా హరీశ్ రావు మమ్మల్ని తిడతాడు అంటూ ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీమ పర్విన్ అనే దివ్యంగురాలి పెన్షన్ తొలగించింది. వారి ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని కారణంగా చూపించారు. జగన్ సర్కార్ తీరును చంద్రబాబు తప్పుపట్టారు.
కర్ణాటక అసెంబ్లీకి బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. టికెట్ రానీ నేతలు వరసగా రాజీనామాలు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామి ఈ రోజు రాజీనామా చేశారు.
రెండు నెలల క్రితం జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ తనయుడు అసద్, మరో నిందితుడు గులామ్ లు పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు.
కేసీఆర్ ఏ పని మొదలుపెట్టినా విజయవంతమవుతుందని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనమని, కేసీఆర్ కు భయపడి నరేంద్ర మోదీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పై వెనక్కి తగ్గిందని మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.