Supreme Court asked to andhra pradesh government for corona death compensation
కర్నాటకలో ముస్లీం రిజర్వేషన్లను తొలగింపుపై (scrapping of 4% Muslim quota in Karnataka) వాదనలు వినేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అంగీకరించింది (Supreme Court). ముస్లీంలకు నాలుగు శాతం రిజర్వేషన్లను తొలగించి, ఇతర వర్గాలకు ఇవ్వడంపై సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిని విచారించేందుకు గురువారం ఓకే చెప్పింది. పిటిషనర్ తరఫున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు (senior advocate Kapil Sibal). చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్థివాలా ధర్మాసనం (Chief Justice D Y Chandrachud and justices P S Narasimha and J B Pardiwala) విచారణ కోసం జాబితా చేసేందుకు ఆమోదం తెలిపింది. నాలుగు శాతం రిజర్వేషన్ తొలగింపు పైన తాము పిటిషన్ దాఖలు చేశామని సిబాల్ పేర్కొన్నారు. దానికి చీఫ్ జస్టిస్ స్పందిస్తూ పిటిషన్ లోని లోపాలను సవరించలేదన్నారు. అయితే అన్నింటిని సవరించామని సిబాల్ వెల్లడించారు. అయితే దానిని వింటామని న్యాయస్థానం తెలిపింది.
కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రభుత్వం (Chief Minister Basavaraj Bommai) ఇటీవల ముస్లీంలకు నాలుగు శాతం రిజర్వేషన్ ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నాలుగు శాతం రిజర్వేషన్ ను రెండు శాతం చొప్పున వొక్కలిగాస్, లింగాయత్ (Vokkaligas and Lingayats) వర్గాలకు కేటాయించింది. కాగా, రిజర్వేషన్ కోటాలను కీలక మార్పులు చేసింది ప్రభుత్వం. ఎస్సీలకు రిజర్వేషన్ ను 17 శాతానికి పెంచింది. తద్వారా ప్రస్తుత రిజర్వేషన్ కోటాను 50 శాతం నుండి 56 శాతానికి పెంచింది. ఇక ముస్లీంలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందించే పది శాతం రిజర్వేషన్ లో చేర్చింది. షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీలకు కూడా ఇదివరకు 15 శాతం ఉండగా ఇప్పుడు 17 శాతానికి, షెడ్యూల్డ్ తెగలు అంటే ఎస్టీలకు 3 శాతం నుండి 7 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.