Perni Nani : కేసీఆర్ ని ఏమీచేయలేక మమ్మల్ని గెలుకుతున్నాడు
Perni Nani : విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ మధ్య గట్టి చిచ్చే పెట్టింది. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఇటీవల హరీష్ రావు చేసిన కామెంట్స్ కి.. తాజాగా ఏపీ మంత్రులు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. మామ కెసిఆర్ పై ఎప్పుడు కడుపు రగిలినా హరీశ్ రావు మమ్మల్ని తిడతాడు అంటూ వ్యాఖ్యానించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ మధ్య గట్టి చిచ్చే పెట్టింది. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఇటీవల హరీష్ రావు చేసిన కామెంట్స్ కి.. తాజాగా ఏపీ మంత్రులు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. మామ కేసీఆర్ పై ఎప్పుడు కడుపు రగిలినా హరీశ్ రావు మమ్మల్ని తిడతాడు అంటూ వ్యాఖ్యానించారు.
“కేసీఆర్ ను ఏమీ చేయలేక మనల్ని గెలుకుతుంటాడు… రాజకీయాల్లో హరీశ్ రావుది పదునైన బుర్ర. నాతో చాకిరీ చేయించుకుంటున్న కేసీఆర్… కొడుకును, కూతురిని అభివృద్ధి చేసుకుంటున్నాడు… తన పరిస్థితి ఏంటా అని హరీశ్ రావు లోపల్లోపల కుతకుతలాడి పోతుంటాడు. పైకి మాత్రం ఫుల్లుగా యాక్షన్ చేస్తుంటాడు… మామయ్యా, మామయ్యా అంటుంటాడు. రామారావును చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టు కేసీఆర్ ను వెన్నుపోటు పొడిచేందుకు ఎదురుచూస్తున్నాడు. కేసీఆర్ తనను పట్టించుకోవడంలేదని హరీశ్ కు కోపం” అని పేర్ని నాని ధ్వజమెత్తారు.
“కేసీఆర్ ను నేరుగా తిట్టలేక మనల్ని విమర్శిస్తుంటాడు. అప్పుడు మనం హరీశ్ ను తిట్టకుండా ప్రభుత్వాధినేత అయిన కేసీఆర్ నే కదా తిడతాం… హరీశ్ కు కావాల్సింది అదే. తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో చూద్దామా? ఎంతసేపు హైదరాబాదులో, సిద్ధిపేటలోనే చూస్తే సరిపోతుందా? తెలంగాణలో ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా! మాక్కూడా తెలంగాణలో ఫ్రెండ్స్ ఉన్నారు… ఈ మామా అల్లుళ్లతో చస్తున్నాం రా బాబూ అంటున్నారు. అసలు, హైదరాబాదులోనే సరిగా రోడ్లు లేని ప్రాంతాలకు తీసుకెళతాను పద. మీ మామను తిట్టించాలంటే మమ్మల్ని కెలకడం ఎందుకు? హరీశ్ రావు వలస కార్మికులను తెలంగాణలో ఓట్లు నమోదు చేయించుకోమంటున్నాడు… మరి, ఏపీపై అంత ప్రేమ ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఎందుకు అడ్డుకున్నారు? నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే రకం కేసీఆర్… మళ్లీ మామను తిట్టకపోతే హరీశ్ రావు ఫీలవుతాడు. కేసీఆర్ ను మనం తిడతామని ఆయన ఎంతో నమ్మకంతో మనల్ని కెలికాడు… కేసీఆర్ ను మనం తిట్టకపోతే ఎలా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దొంగ ప్రాజెక్టు అయితే… డిండి, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్లు దొంగతనంగా పెట్టుకున్నట్టు కాదా. మీ ప్రజలపై మీకెలా ప్రేమ ఉందో మా ప్రజలపై మాకు అలాగే ప్రేమ ఉంది. ఈ సందర్భంగా హరీశ్ రావుకు చెప్పేదొక్కటే… మీ మామపై మీకు ఎప్పుడు కోపం వచ్చినా, ఆయనను ఎప్పుడు బూతులు తిట్టించాలని భావించినా మమ్మల్ని గిల్లితే చాలు… మీ కోరిక ప్రకారం కెసిఆర్ ను తిట్టడానికి సదా మేం సిద్ధంగా ఉంటామని ప్రేమపూర్వకంగా చెబుతున్నాం” అని పేర్ని నాని విమర్శించారు.