YCP Mla Perni Nani:అభివృద్ది గురించి తెలంగాణ మంత్రి హరీశ్ రావు (Harish rao) చేసిన కామెంట్స్ ఏపీ, తెలంగాణ నేతల మధ్య డైలాగ్ వార్‌కు కారణమైంది. ఇదే అంశంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని (perni nani) స్పందించారు. మామ కేసీఆర్‌పై (kcr) కడుపు రగిలితే హరీశ్ రావు (harish rao) మమ్మల్ని తిడతారని పేర్ని నాని (perni nani) అన్నారు. మామను (uncle) ఏమీ చేయలేక.. మమ్మల్ని అంటాడు అన్నారు.
రాజకీయాల్లో హరీశ్ రావు (harish rao) యాక్టివ్ అని.. తనతో చాకిరీ చేయించుకుని.. కుమారుడు (son), కూతురుని (daughter) డెవలప్ చేసుకుంటున్నారని హరీశ్ రావు (harish rao) ఫీల్ (feel) అవుతున్నాడని నాని (nani) గుర్తుచేశారు. అందుకే పైకి బాగా ఉంటూనే.. లోలోన మదన పడుతున్నారని తెలిపారు. మామ కేసీఆర్ (kcr) తనను పట్టించుకోవడం లేదని హరీశ్ రావుకు (harish rao) కోపం అని పేర్ని నాని (perni nani) వివరించారు. మామా అల్లుళ్ల గొడవలే విమర్శలకు కారణం అని పేర్కొన్నారు. తిరిగి ఏపీ నేతలు కేసీఆర్‌ను (kcr) తిడతారని.. హరీశ్ రావుకు (harish rao) కావాల్సింది ఇది అని వివరించారు.
తెలంగాణలో రోడ్డు ఎలా ఉన్నాయో చూద్దామా అని హరీశ్ రావు (harish rao) అడిగారు. హైదరాబాద్ (hyderabad), సిద్దిపేట (siddipeta) కాదని.. ఇతర ప్రాంతాలు కూడా ఉన్నాయని వివరించారు. తమకు అక్కడ దోస్తులు (friends) ఉన్నారని.. మామా అల్లుళ్లతో చస్తున్నాం అంటున్నారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో (hyderabad) రోడ్లు సరిగా లేని ప్రాంతాలు చాలా ఉన్నాయని వివరించారు.
ఏపీ మీద అంత ప్రేమ ఉంటే రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ఎందుకు అడ్డుకున్నారు అని పేర్ని నాని అడిగారు. ఇదీ దొంగ ప్రాజెక్ట్ అయితే డిండి, పాలమూరు లిప్ట్ ఇరిగేషన్లు ఏంటీ అడిగారు. ఇలా ఓ ప్రాంతాన్ని తక్కువ చేసి మాట్లాడటం మంచి పద్దతి కాదని చెప్పారు. మీ మధ్య సమస్య ఉంటే.. ఇలా తమను తిట్టడం ఎంత మాత్రం మంచిది కాదని అడిగారు.