Atiq Ahmed’s son killed: ఎన్కౌంటర్లో అతిక్ అహ్మద్ కొడుకు మృతి
రెండు నెలల క్రితం జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ తనయుడు అసద్, మరో నిందితుడు గులామ్ లు పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు.
రాజకీయ నాయకుడి నుండి గ్యాంగ్ స్టర్ గా మారిన అతిక్ అహ్మద్ తనయుడు అసద్ ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు (Gangster-politician Atiq Ahmed’s son Asad killed). ఉమేష్ పాల్ హత్య కేసులో అసద్ నిందితుడు. అతనితో పాటు మరో వ్యక్తి.. మొత్తం ఇద్దరు చనిపోయారు. ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చేతిలో ఝాన్సీలో గురువారం వారు ఎదురు కాల్పుల్లో మరణించారు. వారి వద్ద విదేశీ తయారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అసద్ తో పాటు ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మరో వ్యక్తి పేరు గులామ్. ప్రయాగ్ రాజ్ ఉమేష్ పాల్ హత్య కేసులో వీరు ఇద్దరు కూడా మోస్ట్ వాంటెడ్ నిందితులు (Most Wanted in Umesh Pal murder case). అసద్, గులామ్.. ఇద్దరి పైన రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు.
డిప్యూటీ ఎస్పీ నవెందు, డిప్యూటీ ఎస్పీ విమల్ ఆధ్వర్యంలో పోలీసులు వారి కోసం సెర్చ్ చేస్తుండగా, ఎదురు కాల్పులు జరిగాయి. ఉమేష్ హత్య కేసులో (Umesh Pal murder case) అతిక్ అహ్మద్ ను (Atiq Ahmed) ఇవాళ ప్రయాగ్ రాజ్ మెజిస్ట్రేట్ (Prayagraj magistrate) ముందు హాజరుపరిచారు. వీరిద్దరు ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్లు యూపీ పోలీసులు (up police) అధికారికంగా ప్రకటించారు.
2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ఉమేష్ పాల్ కీలక సాక్షి. ఈ నెల ఫిబ్రవరి 24న ఉమేష్ పాల్ ను దుండగులు కాల్చి చంపారు. అతని భార్య జయపాల్ ఫిబ్రవరి 25వ తేదీన ఫిర్యాదు చేయడంతో పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. అదే రోజు పోలీసులు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్, అసద్, గులామ్ తదితరుల పైన కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద వారి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతిక్ అహ్మద్ 2005లో రాజు పాల్ హత్య కేసులోను కీలక నిందితుడిగా ఉన్నాడు. అసద్, గులామ్ లు ఎన్ కౌంటర్ లో ఈ రోజు మరణించారని తెలిసి ఉమేష్ పాల్ భార్య స్పందించారు. న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు.