కేసీఆర్ కుటుంబం (kcr family) తమ స్వార్థానికి హైదరాబాద్ నగరాన్ని ధ్వంసం చేస్తారా, కేబీఆర్ పార్కు (kbr park) వద్ద భారీ హోటల్ నిర్మాణం (hotel building) ఎందుకని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (telangana congress chief revanth reddy) గురువారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు (KBR park) వద్ద ధనదాహంతో 15 అంతస్తుల భవన నిర్మాణానికి ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. తాను రాజకీయ విమర్శలు చేయడం లేదని, తెలంగాణ, భాగ్యనగరాన్ని కాపాడేందుకే తాను మాట్లాడుతున్నానని చెప్పారు. తెలంగాణకు (telangana), భాగ్యనగరానికి (bhagyanagaram) కేబీఆర్ పార్కు (kbr park) తలమానికం అన్నారు. ఇక్కడ నెమళ్లతో పాటు ఎన్నో వన్యజీవులు జీవిస్తున్నాయన్నారు. ఇప్పుడు కేబీఆర్ పార్కు వద్ద భారీ హోటల్ నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఈ నిర్మాణం ద్వారా పర్యావరణం, వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2006లోను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతించిందని, కానీ అది మూడంతస్తులకే పరిమితం అన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, భారీ నిర్మాణాలకు నాటి ప్రభుత్వం అనుమతివ్వలేదన్నారు.
కానీ ఇప్పుడు అక్రమ నిర్మాణాలు ప్రమాదకరంగా మారాయన్నారు. కేటీఆర్, అతని తండ్రి విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మీ స్వార్థానికి హైదరాబాద్ నగరానని బలీ చేయవద్దన్నారు. డీ9 గ్యాంగ్ రాష్ట్రాన్ని దోచేస్తోందన్నారు. కేబీఆర్ పార్కు వారసత్వ సంపద అని, కేంద్రం కూడా అనుమతి ఇవ్వడం లేదని, అయినప్పటికీ నిర్మాణం ఎలా చేస్తున్నారన్నారు. కేంద్రం నిబంధనల ప్రకారం కేబీఆర్ పార్కులో పువ్వు తెంపినా శిక్షార్హమని, సౌండ్ పొల్యూషన్ వంటివి కూడా ఇక్కడ దూరం అన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ విధ్వంసం జరుగుతోందన్నారు. వందల కోట్ల దోపిడీకి ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారన్నారు. కేబీఆర్ పార్కు తెలంగాణ వారసత్వ సంపద అని, దీనిని కాపాడుకోవాల్సి ఉందన్నారు. ఇక్కడి వాకర్స్ అసోసియేషన్ దీనిపై పోరాటం చేయాలని సూచించారు. నగర ప్రజల తమ ఆరోగ్యం కాపాడుకునేందుకు కేబీఆర్ పార్కు సంపద ఉపయోగపడుతుందన్నారు.
మీకు అంత డబ్బు దాహం ఉంటే మరోచోట కట్టుకోవాలని కేటీఆర్, కేసీఆర్ కు సూచించారు. ఇక్కడ భూమి లోపల 3 అంతస్తులు, భూమి పైన 12 అంతస్తులు ఎలా కడుతున్నారని ప్రశ్నించారు. నిజాం కాలం నాటి భవనాలను కూల్చేందుకు ఎందుకు, ఎవరు అనుమతిచ్చారన్నారు. యువరాజు కేటీఆర్ తన మిత్రుల కోసం సంస్థలను క్రియేట్ చేసి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారన్నారు. భూమి లోపల కూడా ఐదు అంతస్తులు కడుతున్నారంటే.. ఈ భాగ్యనగరాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ నగరాన్ని ఎందరో రాజులు, చివరకు నియంతలు, ఆంధ్రా వాళ్లు కూడా కాపాడారని, కానీ మీరు మాత్రం నాశనం చేస్తున్నారన్నారు. భవిష్యత్తు తరాలకు కాలుష్య నగరాన్ని ఇవ్వాలని చూస్తున్నారా అన్నారు. ప్రకృతి విధ్వంసం చేయవద్దన్నారు. త్వరలో పూర్తి ఆధారాలు మీడియా, ప్రజల ముందు పెట్టి తాను కేసీఆర్, కేటీఆర్ ను దోషిగా నిలుపుతానని చెప్పారు.
మీడియాకు హితవు
భాగ్యనగరం మనందరిదీ అని, దీనిని భవిష్యత్తు తరాలకు అందించవలసి ఉందని చెప్పారు. తాను చెప్పే దానిని మీడియా ప్రజలకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. మీడియాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్న విషయం తనకు తెలుసునని, పేపర్ మీడియా తమకు సహకరిస్తోందని, కానీ టీవీ మీడియా మాత్రమే అలా చేయడం లేదన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై స్పందిస్తూ… సీజన్ వచ్చినప్పుడు ఆకులు రాలడం సహజమే అన్నారు.