కరీంనగర్ జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 9 గంటల నుంచి 11 వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్లంద కుంట 58.12, హుజూరాబాద్ 58.51, జమ్మికుంట 49.16, వీణవంక 54.08, సైదాపూర్ 57.42, మొత్తం 55.65 శాతం నమోదయింది. మొత్తం ఓటర్లు 1,65,046 మందికి గాను 91,840 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.