విశాఖ ఉక్కు (Vizag Steel plant) కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆధీనంలోనే ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు (Jana Sena chief Pawan Kalyan). వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పైన ((Vizag Steel plant privatisation) ఇప్పటికి ఇప్పుడు ముందుకు వెళ్లే ఆలోచన లేదని కేంద్రమంత్రి ఫఘన్ సింగ్ కులస్తే చేసిన ప్రకటనపై జనసేనాని స్పందించారు. కేంద్రమంత్రి (union minister) ప్రకటన కొత్త ఆశలు రేపిందన్నారు. వైజాగ్ స్టీల్ పైన (Vizag Steel plant) అఖిలపక్షాన్ని (all party) కేంద్రం వద్దకు తీసుకు వెళ్లాలని తాము జగన్ ప్రభుత్వాన్ని కోరామని, దీనిపై వారు స్పందించలేదని చెప్పారు. వారు కనీసం ప్లాంట్ ను కాపాడుతామని చెప్పలేకపోయారన్నారు. విశాఖ ఉక్కు తెలుగువారి భావోద్వేగాలతో ముడివడిన అంశమని, ఇలాంటి అంశంపై వైసీపీ మౌనంగా ఉందని దుయ్యబట్టారు. ఇటీవల తాను కేంద్రమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై మాట్లాడానని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవ్వకుండా, కార్మికుల పక్షాన తొలి నుండి పోరాడుతూ, కేంద్రంతో సంప్రదింపులు జరిపిన ఏకైక పార్టీ జనసేన అన్నారు. గత వారం ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఈ అంశంపై ప్రత్యేకంగా కేంద్రానికి వివరించినట్లు తెలిపారు.
ప్రయివేటీకరణ వద్దని తాను చెప్పినప్పుడు బీజేపీ నేతలు సానుకూలంగా స్పందించారన్నారు. కొద్ది రోజులుగా తోటి తెలంగాణ రాష్ట్రం కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ పైన స్పందిస్తోందన్నారు. దీని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, నేపథ్యాల పైన వైసీపీ పాలకులు విమర్శలు చేస్తున్నారే తప్ప పరిశ్రమను కాపాడుతామనే మాట మాత్రం చెప్పలేకపోయారన్నారు. చిత్తశుద్ధి లేని పాలకుల వల్ల విశాఖ ఉక్కు పరిరక్షణ అంశం ముందుకు వెళ్లలేదన్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి చేసిన ప్రకటన కొత్త ఆశలు రేపిందన్నారు. జనసేన తొలి నుండి ఈ పరిశ్రమను పరిరక్షించాలని కోరుతోందన్నారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ను బలోపేతం చేయాలని నిర్ణయించిన దృష్ట్యా విశాఖ ఉక్కు బలపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.