»Ap Minister Sidiri Appalaraju Counter To Harish Rao
AP Minister On TS Minister : ఫామ్ హౌస్ లో కూర్చొని కల్లు తాగేవారు ఏపీలో లేరు.. హరీష్ కి ఏపీ మంత్రి కౌంటర్..
AP Minister : తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు.. ఏపీలో తీవ్ర దుమారమే రేపాయి. అందుకే... ఏపీ అధికార పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు రెచ్చిపోతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులను ఇష్టమొచ్చినట్లుగా తిట్టిపోస్తున్నారు. తాజాగా... ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు.. హరీష్ రావును ఘోరంగా విమర్శించారు.
తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు.. ఏపీలో తీవ్ర దుమారమే రేపాయి. అందుకే… ఏపీ అధికార పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు రెచ్చిపోతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులను ఇష్టమొచ్చినట్లుగా తిట్టిపోస్తున్నారు. తాజాగా… ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు.. హరీష్ రావును ఘోరంగా విమర్శించారు.
హరీష్ రావు కల్లు తాగిన కోతిలాగా ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఫామ్ హౌస్ లో కూర్చుని కల్లు తాగేవారు ఏపీలో లేరన్నారు. కవితక్క లాగా చాటింగ్ లు తమ వద్ద లేవని సెటైర్లు వేశారు. మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు . మీకు చేతనైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలి కానీ ప్రైవేటీకరణను ప్రోత్సహించేలా బిడ్ వేస్తామని అంటారా అని హరీష్ రావును నిలదీశారు.
ఎక్కడైనా ప్రభుత్వ సంస్థలు బిడ్డింగ్ వేస్తాయా? అంటూ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ అని మార్చేస్తే జాతీయ పార్టీ అయిపోతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో జాతీయవాదం అనేది ఏ కోశానా లేదని అన్నారు. తెలంగాణలో దొరల పాలన సాగుతోందని పేర్కొన్నారు .తెలంగాణ మీ జాగీరా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ప్రాంతీయ ఉగ్రవాదులు అని ఆరోపించారు. మా ఆంధ్ర వాళ్లు తెలంగాణకు రావడం మానస్తే అక్కడ అడుక్కోవడం తప్ప ఏమీ లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు