»Karnataka Elections Bjp Does Not Want Muslim Votes Says Former Minister Ks Eshwarappa
Karnataka ఎన్నికల్లో ఒక్క Muslim ఓటు వద్దు.. మాజీ మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలు
బీజేపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన కులాల లెక్కలు తీద్దాం. ప్రతి కులం మా పాలనతో లబ్ధి పొందింది. మరి అలాంటి సమయంలో ముస్లింల ఓట్లు మాకెందుకు? శివమొగ్గలో దాదాపు 60 వేల మంది ఉన్నారు. మాకు వారి ఓట్లు అవసరం లేదు
అభివృద్ధి, సంక్షేమం వదిలేసి బీజేపీ మత రాజకీయాలను (Religious Politics) కొనసాగిస్తోంది. మొన్న తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ‘ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం’ అని ప్రకటించారు. ఇక కర్ణాటకలో (Karnataka) ఆ పార్టీ నాయకులు ముస్లిం ఓట్లు మాకొద్దు అని ప్రకటిస్తున్నారు. ఒక్క ముస్లిం ఓటు కూడా వద్దని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. తమకు ఒక్క హిందూవుల ఓట్లు మాత్రమే కావాలని ప్రకటనలు ఇస్తున్నారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో కలకలం రేపుతున్నాయి.
మే 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో రాజకీయం హాట్ హాట్ గా కొనసాగుతోంది. శివమొగ్గలో (Shivamogga) మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) సోమవారం ప్రచారంలో పాల్గొన్నాడు. వీరశైవ-లింగాయత్ ఆత్మీయ సమ్మేళనంలో ఈశ్వరప్ప మాట్లాడుతూ.. ‘బీజేపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన కులాల లెక్కలు తీద్దాం. ప్రతి కులం మా పాలనతో లబ్ధి పొందింది. మరి అలాంటి సమయంలో ముస్లింల ఓట్లు మాకెందుకు? శివమొగ్గలో దాదాపు 60 వేల మంది ఉన్నారు. మాకు వారి ఓట్లు అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. మా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ముస్లింలు మాత్రం మాకు ఓటు వేస్తారు అని పేర్కొన్నారు. జాతీయభావం ఉన్న ముస్లింలు బీజేపీకి ఓటేస్తారు అని చెప్పారు. ‘మా పాలనలో హిందూవులు సురక్షితంగా ఉన్నారు. హిందూవులపై దాడి చేసేందుకు ఎవరూ సాహసించడం లేదు. మా ప్రభుత్వం లేకుంటే తమకు రక్షఉండదని ప్రజలు భావిస్తున్నారు’ అని ఈశ్వరప్ప తెలిపారు. కాగా ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కూడా ఉన్నారు.
కాగా ఈ వ్యాఖ్యలపై మైనార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ఓట్లు వద్దు అనే వారికి ఎన్నికల్లో బుద్ధి చెబుతామని ముస్లిం నాయకులు హెచ్చరిస్తున్నారు. ఒక్క శివమొగ్గ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలోని 224 నియోజకవర్గంలో బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింలు ఓటేస్తారు అని కాంగ్రెస్ పార్టీలోని ఓ ముస్లిం నాయకుడు తెలిపారు. ఈసారి వచ్చేది తమ ప్రభుత్వమేనని.. కమీషన్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని పేర్కొన్నారు. కాగా తాజా ఎన్నికల్లో ఈశ్వరప్పకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన ప్రధాని మోదీ (Narendra Modi) ఫోన్ చేసి ఈశ్వరప్పను బుజ్జగించి పార్టీలో ఉండాలని కోరారు.