ఏప్రిల్ 1 అంటే ఏప్రిల్ ఫూల్ డే (April Fool Day) అనే ఒక నమ్మకం ఉంది. ఈ రోజు అందరూ ఒకరినొకరు ఆట (Play Game) పట్టించుకుంటారు. ఈ ఆట పట్టించుకోవడం అనే వ్యవహారం ఇప్పుడు రాజకీయాలకు పాకింది. హామీ ఇచ్చి ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేశాయని పలు పార్టీ ఎద్దేవా చేశారు. శనివారం ఏప్రిల్ 1వ తేదీ కావడంతో తెలంగాణలో ఇరు పార్టీలు పరస్పరం ట్వీట్లతో యుద్ధం చేశాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ రూ.15 లక్షల నగదు బ్యాంక్ లో (Black Money Credit) జమ చేశాడు అనే దానిపై ట్వీట్లు కొనసాగాయి. దీంతో రాజకీయంగా ఏప్రిల్ ఫూల్ డే వైరల్ గా మారింది.
ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీ (Bharat Rashtra Samithi- BRS Party) సోషల్ మీడియా విభాగం నరేంద్ర మోదీ (Narendra Modi), బీజేపీని ఆటాడుకుంది. ‘2014లో మోదీ ఇస్తానన్న నల్లధనం డబ్బులు రూ.15 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి’ అని చెప్పి.. నమ్మారా ఇది? నమ్మితే ఏప్రిల్ ఫూల్ అని తెలిపారు. ఇక ‘రేపు ఉదయం మోదీ 8 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి విలేకరుల సమావేశం నిర్వహించబోతున్నాడు.. నేరుగా మీడియాతో మాట్లాడనున్నాడు’ అని చెప్పారు. ఇది నమ్మరా అయితే ఏప్రిల్ ఫూల్ అని ట్వీట్లు చేశారు. అంటే మోదీ ప్రెస్ మీట్ కు భయపడుతున్నాడనే విషయాన్ని పరోక్షంగా ఎత్తి చూపారు. ‘మనకు అచ్చేదిన్ వచ్చేశాయి’, ‘తెలంగాణకు భారీగా బకాయిలు చెల్లించిన కేంద్ర ప్రభుత్వం’, ‘2 కోట్ల ఉద్యోగ భర్తీలు చేస్తున్న కేంద్రం’ వంటి వాటిపై బీజేపీ, నరేంద్ర మోదీ లక్ష్యంగా పలువురు ట్వీట్లు చేశారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నమ్మితే ప్రజలు నిజంగా ఫూల్స్ అవుతారని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. ఇప్పటికైనా బీజేపీని నమ్మి మోసపోవద్దని సూచించారు. కాగా దీనికి ప్రతిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు. నిరుద్యోగ భృతి అంశంపై ప్రస్తావన చేస్తూ ట్వీట్ చేశారు. కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇస్తారని నమ్మితే ఏప్రిల్ ఫూలే అంటూ ఓ పోస్ట్ ట్విటర్ లో వదిలాడు.