SRCL: వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి హుండీలను బుధవారం లెక్కించారు. గత 25 రోజులకు గాను నగదు రూపంలో రూ. 71,80,529 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వీటితో పాటు 35 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, 3 కిలోల 100 గ్రాముల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించారు. ఆలయ ఈవో ఎల్. రమాదేవి, సమక్షంలో నిర్వహించారు.