బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి అక్కడి నుంచి పారిపోయి భారత్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై బంగ్లా తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హసీనాను పదవి నుంచి దింపే కుట్రలో ఎవరున్నారో బయటకు రాలేదు కానీ.. మహఫుజ్ అబ్దుల్లా పాత్ర ఉండొచ్చంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాగా, కుట్రలో అమెరికా హస్త ఉందని మే నెలలో హసీనా కూడా ప్రకటన చేశారు.